స్టాక్ మార్కెట్లు నేడు సరికొత్త శిఖరాల వద్ద ముగిశాయి. ద్రవ్యోల్బణం గణాంకాల ప్రతికూలతలతో తొలుత నష్టాలను నమోదు చేశాయి సూచీలు. అయితే హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్ వంటి హెవీ వెయింట్ షేర్లు సానుకూలంగా స్పందించి.. లాభాలకు దన్నుగా నిలిచాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 93 పాయింట్లు వృద్ధి చెందింది. చివరకు 41,953 (జీవనకాల గరిష్ఠం) వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 33 పాయింట్ల లాభంతోతో 12,362 (జీవనకాల గరిష్ఠం) వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 41,994 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 41,771 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,374 పాయింట్ల అత్యధిక స్థాయి.. 12,309 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.