తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్లు: ​​​​​​​వరుసగా రెండోరోజూ కొనసాగుతున్న లాభాలు - స్టాక్ మార్కెట్ వార్తలు

దేశీయ సానుకూలతలతో స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 151 పాయింట్లు, నిఫ్టీ 44 పాయింట్ల వృద్ధితో ట్రేడవుతున్నాయి.

STOCKS
స్టాక్​ మార్కెట్లు

By

Published : Jan 2, 2020, 9:41 AM IST

స్టాక్​ మార్కెట్లు వరుసగా రెండోరోజూ లాభాల్లో కొనసాగుతున్నాయి. లోహ, బ్యాంకింగ్​, వాహన రంగ షేర్లు లాభాలకు ఊతమందిస్తున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 151 పాయింట్ల లాభంతో 41,457 వద్ద ట్రేడవుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 44 పాయింట్ల వృద్ధితో 12,226 వద్ద కొనసాగుతోంది.

లాభనష్టాల్లోనివివే..

టాటా స్టీల్​, ఆల్ట్రాటెక్ సిమెంట్​,భారతీ ఎయిర్​టెల్, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, హీరో మోటోకార్ప్​, బజాజ్ ఆటో షేర్లు లాభాల్లో ఉన్నాయి.

టైటాన్​, ఎన్​టీపీసీ, పవర్​ గ్రిడ్​, ఏషియన్​ పెయింట్స్​, ఎం&ఎం షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

ఇదీ చూడండి:నిర్మలా సీతారామన్‌ రెండో బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి

ABOUT THE AUTHOR

...view details