పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు మరో ఘనత దక్కింది. మార్కెట్ క్యాపిటలైజేషన్లో.. రూ.9 లక్షల కోట్ల విలువైన తొలి భారతీయ సంస్థగా అవతరించి చరిత్ర సృష్టించింది.
నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్ 2019-20 రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో కంపెనీ భారీ లాభాలు నమోదు చేస్తుందనే అంచనాలతో బీఎస్ఈలో షేరు విలువ 2.28 శాతానికిపైగా పెరిగి.. రూ.1,428 వద్ద జీవన కాల గరిష్ఠాన్ని తాకింది. ఫలితంగా సంస్థ మార్కెట్ క్యాపిటల్ విలువ రూ.9,01,490.09 కోట్లకు చేరింది.