తెలంగాణ

telangana

ETV Bharat / business

రివ్యూ 2019: ఆన్​లైన్​ ఫుడ్​ బిజ్​లో బిర్యానీనే కింగ్​

భారత్​లో ఆహార పదార్థాలను ఆన్​లైన్​లో ఆర్డరివ్వడం ఏటేటా పెరుగుతూ వస్తోంది. ఇలా ఈ ఏడాది ఆర్డర్ల ద్వారా ఎక్కువగా కొన్న ఆహార పదార్థాల్లో బిర్యానీ అగ్రస్థానంలో నిలిచింది. ఇంకా 2019లో ఆహార పదార్థాల ట్రెండ్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి రివైండ్ చేసుకుందాం.

biryani
మళ్లీ బిర్యానీనే కింగ్​

By

Published : Dec 26, 2019, 12:26 PM IST

2019 ముగిసే సమయం దగ్గరకొచ్చింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఫుడ్​ ట్రెండ్స్​ గమనిస్తే.. బిర్యానీ అగ్రస్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆన్​లైన్ ఫుడ్​ డెలివరీ సంస్థ 'స్విగ్గీ ఇండియా' వెల్లడించిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన ఆహార పదార్థంగా బిర్యానీ ఘనత సాధించింది.

ఈ ఏడాది ప్రతి నిమిషానికి 95 బిర్యానీలు డెలివరీ చేసింది స్విగ్గీ.. అంటే సెకనుకు 1.6 బిర్యానీలు అన్నమాట.

బిర్యానీల్లోనూ.. బోన్​లెస్​ చికెన్​ బిర్యానీ, చికెన్​ ధమ్​ బిర్యానీ, మటన్​ బిర్యానీ, ఎగ్​ బిర్యానీ, వెజ్​ బిర్యానీ, పనీర్ బిర్యానీ ఎక్కువ ఆదరణ పొందాయి.

టాప్​ 5 ఆర్డర్లు వీటికే...

చికెన్​ బిర్యానీ, మసాలా దోశ, పనీర్​ బటర్​ మసాలా, చికెన్ ఫ్రైడ్ రైస్​, మటన్ బిర్యానీ ఈ ఏడాది ఎక్కువగా ఆర్డర్లు వచ్చిన ఐదు ఉత్తమ ఆహారపదార్ధాల జాబితాలో ఉన్నాయి. ఎగ్​ ఫ్రైడ్​ రైస్, వెజ్​ బిర్యానీ, తందూరీ చికెన్​, దాల్​ మఖానీ వంటి వాటినీ మనవాళ్లు తెగ ఇష్టపడ్డట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఆహారం.. ఆరోగ్యం..

ఆరోగ్యకరమైన ఆహారానికి ఈ ఏడాది గిరాకీ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. కీటో ఆహార పదార్థాల విక్రయాలు ఈ ఏడాది 306 శాతం పెరిగాయంటే గిరాకీ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కీటో బ్రౌనీస్​, కీటో ఫ్రెండ్లీ టస్కన్​ చికెన్​, హెల్తీ రెడ్​ రైస్​ పోహా వంటివి ఎక్కువగా ఆర్డర్లిచ్చిన జాబితాలో ఉన్నాయి.

కీటో ఫ్రెండ్లీ టస్కన్​ చికెన్

ఫిట్​నెస్​పై దృష్టి సారించే వారికి కీటో బ్రౌనీస్​ ఉపయోగకరమైన.. ఆహార పదార్ధంగా చెప్పొచ్చు. ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాల మొత్తం ఆర్డర్లు ఈ ఏడాది 249 శాతం పెరిగినట్లు గణాంకాల్లో వెల్లడైంది.

పిజ్జాలో శాకాహార టాపింగ్సే అధికం..

కొత్త కొత్త వంటకాలను రుచి చూసే ధోరణి దేశంలో ఇటీవల బాగా పెరిగింది. అయితే పిజ్జాలపై టాపింగ్స్​లో మాత్రం శాకాహారం వైపే మనవాళ్లు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.

ఈ ఏడాది పిజ్జా ఆర్డర్లలో టాపింగ్స్​గా.. చీజ్, ఉల్లి, పనీర్​, ఎక్స్​ట్రా చీజ్​, పుట్టగొడుగులు, క్యాప్సికం, మొక్కజొన్న, జలాపినోస్​, ఆలీవ్​ అధికంగా ఉన్నట్లు తెలిసింది.

ఎక్స్​ట్రా చీజ్​ పిట్జా

మిఠాయిల్లో ఇవే టాప్​..

భారతీయ వంటకాల్లో మిఠాయిలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ ఏడాది ఎక్కువగా ఆన్​లైన్​లో ఆర్డర్లిచ్చిన మిఠాయిల జాబితా మొత్తంలో.. గులాబ్ జామూన్​​, మూంగ్​ దాల్​ హల్వా అగ్రస్థానాల్లో నిలిచాయి.

గులాబ్​ జామూన్​

మొత్తం ఆర్డర్లపరంగా చూస్తే ఈ ఏడాది 17,69,399 గులాబ్​ జామూన్​లు, 2,00,301 హల్వాలకు ఆన్​లైన్​లో ఆర్డర్లు వచ్చాయి.

డిసెర్ట్​ల జాబితాలో కొత్తగా ఫలూడా చేరింది. ఫలూడాకు 11,94,732 ఆర్డర్లు వచ్చాయి. ఈ ఏడాది మొత్తం 3 లక్షల కేక్​లకు ఆన్​లైన్​లో ఆర్డర్లు రాగా.. వాటిలో బ్లాక్​ ఫారెస్ట్ రకం ఎక్కువగా కొనుగోలు చేసినట్లు తెలిసింది.

పై గణాంకాలన్నీ ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్​ మధ్య.. 'స్విగ్గీ' ఆర్డర్ల విశ్లేషణ ద్వారా తీసుకున్నవి. స్విగ్గీ దేశవ్యాప్తంగా ప్రస్తుతం 500 పట్టణాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.

ఇదీ చూడండి:'బకాయిలు వెంటనే చెల్లించి.. మమ్మల్ని వదిలేయండి ప్లీజ్​'

ABOUT THE AUTHOR

...view details