తెలంగాణ

telangana

ETV Bharat / business

చమురు రిటైల్​ రంగంలోనూ రిలయన్స్​ దూకుడు - BUSINESS NEWS TELUGU

ముకేశ్​ అంబానీకి చెందిన రిలయన్స్​ చమురు విభాగం డిసెంబర్​తో ముగిసిన త్రైమాసికంలో భారీ వృద్ధిని నమోదు చేసింది. ఈ మూడు నెలల కాలంలో రిలయన్స్​కు చెందిన దాదాపు 14 వందల పెట్రోల్​ పంపుల్లో.. డీజిల్ విక్రయాల్లో 11 శాతం, పెట్రోల్ అమ్మకాలు​ 15 శాతం పెరిగినట్లు సంస్థ ప్రకటించింది.

reliance
రిలయన్స్

By

Published : Jan 19, 2020, 8:11 PM IST

దేశీయ చమురు రంగ దిగ్గజం రిలయన్స్‌.. చమురు రిటైల్‌ మార్కెట్లోనూ తన హవా కొనసాగిస్తోంది. రిలయన్స్‌కు చెందిన దాదాపు 1,400 పెట్రోల్‌ పంపుల్లో విక్రయాలు 2019 డిసెంబర్‌ 31తో ముగిసిన మూడు నెలల కాలానికి రెండంకెల వృద్ధిరేటును సాధించాయి. ఈ సమయంలో డీజిల్‌ విక్రయాల్లో 11 శాతం వృద్ధిని.. పెట్రోల్‌ విక్రయాల్లో 15 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం చమురు రిటైల్‌ పరిశ్రమ వృద్ధిరేటు డీజిల్‌లో 0.2 శాతం, పెట్రోల్‌లో 7.1 శాతంగా ఉన్నాయి. ఈ లెక్కన రిలయన్స్‌ భారీ వృద్ధిరేటును సాధించినట్లే లెక్క.

"నాణ్యమైన ఉత్పత్తులు, ఉన్న ఆస్తులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం కారణంగా మంచి రాబడులను సాధించాము. పెట్రోల్‌ కార్ల విక్రయాలు పెరగడం, రోడ్లు, గ్రామీణ ప్రాంతాల్లో అనుసంధానత మెరుగవ్వడం వంటి కారణాలు పెట్రోల్‌ డిమాండ్‌ను పెంచాయి" అని రిలయన్స్‌ పేర్కొంది.

డిసెంబర్​తో ముగిసిన త్రైమాసికానికి రిలయన్స్‌ పెట్రో రీటైల్‌ ఆదాయం 5 శాతం పెరిగి రూ.3,725 కోట్లకు చేరింది. ఈ సమయంలో దాదాపు 538 మిలియన్‌ లీటర్ల ఇంధనాన్ని విక్రయించింది రిలయన్స్.

ప్రస్తుతం రిలయన్స్‌ వద్ద 1,394 పెట్రోల్‌ పంపులు ఉన్నాయి. వీటిల్లో 518 పంపులను కంపెనీ సొంతంగా నిర్వహిస్తుండగా.. మిగిలినవి డీలర్‌షిప్‌ల కింద ఉన్నాయి.

ఇదీ చూడండి:'వీఆర్​ఎస్​'కు ఎయిర్​ఇండియా యూనియన్ల డిమాండ్!

ABOUT THE AUTHOR

...view details