దేశవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోన్న క్రమంలో గుజరాత్‌లోని జామ్ నగర్‌లో 1000 పడకల కరోనా చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ ప్రకటించింది. ఈ కేంద్రాల్లో ఆక్సిజన్ సరఫరాతోపాటు.. అన్ని సౌకర్యాలు ఉచితంగా అందజేస్తామని పేర్కొంది. జామ్‌నగర్‌లోని ప్రభుత్వ దంత కళాశాల, ఆసుపత్రిలో వారం లోపు 400 పడకలు, ఆ తర్వాత రెండు వారాల్లో మరో చోట 600 పడకల కరోనా చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.
1000 పడకల ఆస్పత్రిని నిర్మించనున్న రిలయన్స్ - రిలయన్స్
దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో రిలయన్స్ ఫౌండేషన్.. తన ఉదారతను చాటుకుంది. గుజరాత్‌లోని జామ్ నగర్‌లో 1000 పడకల కరోనా చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ ప్రకటించింది. ఆక్సిజన్ సరఫరా సహా అన్ని సౌకర్యాలు ఉండే ఈ కేంద్రాల్లో అన్ని సేవలను ఉచితంగా అందజేస్తామని తెలిపింది.
రిలయన్స్ ఫౌండేషన్
కరోనా రెండో దశతో భారత్ పోరాటం చేస్తున్న సమయంలో అవసరమైన ప్రతి మార్గంలో సాయం చేసేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ భరోసా ఇచ్చింది. ప్రస్తుతం అదనపు వైద్య సౌకర్యరాలు కల్పించడమే కీలకం అని ఓ ప్రకటనలో తెలిపింది.
ఇదీ చదవండి :కాలుతున్న కాష్ఠాలు- ఖాళీ లేని శ్మశానవాటికలు!