తెలంగాణ

telangana

ETV Bharat / business

ప్రపంచ టాప్-100 కంపెనీల్లో రిలయన్స్ - రిలయన్స్ గ్లోబల్ ఫార్చూన్ లిస్ట్

ఫార్చూన్ గ్లోబల్​-500 జాబితాలో 10 స్థానాలు ఎగబాకి.. టాప్-100 కంపెనీల జాబితాలో చేరింది రిలయన్స్ ఇండస్ట్రీస్. దేశీయ అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయల్​ కార్పొరేషన్​ మాత్రం 34 స్థానాలు తగ్గింది.

Fortune Global 500 list
గ్లోబల్ 500 జాబితాలో రిలయన్స్ స్థానం

By

Published : Aug 11, 2020, 5:18 PM IST

ముకేశ్​ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్​ ఇండస్ట్రీస్​ మరో రికార్డు నమోదు చేసింది. ప్రపంచంలో టాప్-100 కంపెనీల జాబితాలో చేరింది. తాజాగా విడుదలైన ఫార్చూన్​ గ్లోబల్​-500 నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

నివేదికలోని కీలకాంశాలు..

  • ఈ జాబితాలో రిలయన్స్ 10 స్థానాలు ఎగబాకి.. 96వ ర్యాంక్​ను దక్కించుకుంది.
  • నిజానికి 2012లోనే రిలయన్స్ ఈ జాబితాలో 99వ ర్యాంక్​ను దక్కించుకుంది. అయితే 2016 నాటికి మళ్లీ 215వ ర్యాంక్​కు పడిపోయింది.
  • ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్​ కార్పొరేషన్​ (ఐఓసీ) మాత్రం ఈ సారి 34 స్థానాలు తగ్గి.. 151 ర్యాంక్​తో సరిపెట్టుకుంది. ఓఎన్​జీసీ 30 స్థానాలు తగ్గి 190 వద్దకు చేరింది.
  • ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్​బీఐ ఇందులో 221వ స్థానంలో నిలిచింది. ఇంతకు ముందుతో పోలిస్తే ఎస్​బీఐ 15 స్థానాలు మెరుగుపడింది.
  • 2020 మార్చి 31 నాటికి ముగిసిన ఆర్థిక సంవత్సర ఆదాయాల ఆధారంగా ఈ జాబితా రూపొందించింది ఫార్చూన్​.
  • 2020 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి రిలయన్స్, ఐఓసీ, ఓఎన్​జీసీ, ఎస్​బీఐ ఆదాయాలు.. వరుసగా 86.2 బిలయన్ డాలర్లు, 69.2 బిలియన్ డాలర్లు, 57 బిలియన్ డాలర్లు, 51 బిలియన్ డాలర్లుగా ఉంది.
  • ఫార్చూన్​ గ్లోబల్-500 జాబితాలో ఈ సారి కూడా 524 బిలియన్​ డాలర్ల వార్షిక ఆదాయంతో వాల్​మార్ట్​ అగ్రస్థానంలో నిలిచింది.

ఇదీ చూడండి:'మైక్రోసాఫ్ట్- టిక్​టాక్ ఒప్పందం కష్టమే'

ABOUT THE AUTHOR

...view details