ఏటీఎం కేంద్రాల్లో దోపిడీలు పెరుగుతన్న నేపథ్యంలో... బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ రిజర్యు బ్యాంక్ ఆఫ్ ఇండియా భద్రతా ప్రమాణాలు పెంచే పనిలో పడింది. ఇందుకోసం ఏటీఎంలను వాటి కేంద్రాల్లో గోడలకు, స్తంభాలకు, ఫ్లోర్లకు బిగించాలని బ్యాంకులన్నింటినీ ఆదేశించింది. సెప్టెంబర్ చివరినాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేసింది.
విమానాశ్రయాలు, నిరంతరం సీసీటీవీ పర్యవేక్షణ ఉండే ప్రాంతాలు, కేంద్ర, రాష్ట్ర భద్రత దళాల నిఘా ఉండే ప్రాంతాల్లో ఇందుకు మినహాయింపు ఇచ్చింది ఆర్బీఐ.
నగదు రవాణా, సరఫరా సంరక్షణకు 2016లో నియమించిన కమిటీ సిఫారసుల మేరకు ఆర్బీఐ ఈ సూచనలు చేసింది.