ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి ఈ ఏడాది పండుగ సీజన్లో రికార్డుస్థాయిలో రుణాలు ఇచ్చినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అక్టోబర్లో మొత్తం రూ.2.52 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు పేర్కొంది. ఇందులో రూ.1.05 లక్షల కోట్లు కొత్త సంస్థలకు ఇచ్చిన రుణాలేనని తెలిపింది. రూ.46,800 కోట్లు నిర్వహణ మూలధన రుణాలుగా మంజూరు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.