తెలంగాణ

telangana

ETV Bharat / business

సత్య నాదెళ్ల ప్లాన్​ హిట్... మైక్రోసాఫ్ట్​కు లాభాల పంట - మైక్రోసాఫ్ట్​ లేటెస్ట్​ న్యూస్​

అమెరికాకు చెందిన ప్రముఖ టెక్​ సంస్థ మైక్రోసాఫ్ట్ 2019 డిసెంబర్ త్రైమాసికంలో భారీ లాభాలను నమోదు చేసింది. 2019 అక్టోబర్​-డిసెంబర్​ మధ్య మూడు నెలల్లో 11.6 బిలియన్ డాలర్ల లాభాన్ని గడించింది.

microsoft
మైక్రోసాఫ్ట్

By

Published : Jan 30, 2020, 12:44 PM IST

Updated : Feb 28, 2020, 12:36 PM IST

టెక్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గత ఏడాది చివరి త్రైమాసికంలో భారీ వృద్ధిని నమోదు చేసింది. 2019 డిసెంబర్​తో ముగిసిన మూడు నెలల కాలంలో లాభం 38 శాతం వృద్ధితో 11.6 బిలియన్​ డాలర్లుగా నమోదైనట్లు మైక్రోసాఫ్ట్​ ప్రకటించింది. ఇదే సమయంలో సంస్థ ఆదాయం 14 శాతం పెరిగి 36.9 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వెల్లడించింది.

వినియోగదారుల ఉత్పత్తులు, వ్యాపార సేవల్లో నమోదైన భారీ అమ్మకాలు ఈ లాభాలకు ప్రోత్సాహమందించినట్లు పేర్కొంది టెక్​ దిగ్గజం.

కన్జూమర్ సాఫ్ట్​వేర్ సంస్థగా ఉన్న మైక్రోసాఫ్ట్​.. వైవిద్యభరితమైన వ్యాపారాలపై అధికంగా దృష్టి సారించి విజయాలు అందుకుంటుందనే విషయాన్ని ఈ లాభాలు నిరూపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

ఆఫీస్ సాఫ్ట్​వేర్​ సూట్, సామాజిక మాధ్యమం లింక్​డ్​ఇన్​లు సహా సంస్థ ఉత్పాదకత వ్యాపారాల ఆదాయం 2019 డిసెంబర్​ త్రైమాసికంలో 17 శాతం పెరిగింది.

ఇదీ చూడండి:సెల్‌ఫోన్‌ కంటే విడిభాగాలపై అధిక పన్నెందుకు?

Last Updated : Feb 28, 2020, 12:36 PM IST

ABOUT THE AUTHOR

...view details