తెలంగాణ

telangana

ETV Bharat / business

పీఎన్​బీ: త్రైమాసిక ఫలితాల్లో రూ.492 కోట్లు నికర నష్టం

పంజాబ్​ నేషనల్​ బ్యాంక్ (పీఎన్​బీ) 2019-20 డిసెంబర్ త్రైమాసికంలో రూ.429.28 కోట్ల నికర నష్టాన్ని నమోదుచేసింది. మొండి బకాయిలు పేరుకుపోవడమే ఇందుకు కారణం.

PNB Q3 loss at Rs 492 cr as NPA provisioning spikes
పీఎన్​బీ: త్రైమాసిక ఫలితాల్లో రూ.492 కోట్లు నికర నష్టం

By

Published : Feb 4, 2020, 9:27 PM IST

Updated : Feb 29, 2020, 4:51 AM IST

మొండి బకాయిలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో పంజాబ్​ నేషనల్​ బ్యాంక్ (పీఎన్​బీ) 2019-20 డిసెంబర్ త్రైమాసికంలో రూ.429.28 కోట్ల నికర నష్టాన్ని నమోదుచేసింది.

ప్రభుత్వ బ్యాంకైన పీఎన్​బీ గతేడాది ఇదే సమయంలో రూ.246.51 కోట్ల నికర లాభం ఆర్జించింది. 2019-20 సెప్టెంబర్ త్రైమాసికానికి రూ.507.05 కోట్ల లాభం నమోదు చేయడం గమనార్హం. తాజా త్రైమాసికంలో పీఎన్​బీ మొత్తం ఆదాయం రూ.15,967.49 కోట్లు రాగా, గతేడాది ఇదే కాలంలో రూ.14,854.24 కోట్లుగా ఉంది. అయితే గతేడాది రూ.2,565.77 కోట్లున్న మొండిబకాయిలు, ఈ ఏడాది రూ.4,445.36 కోట్లుకు పెరిగిపోయాయి.

ఏకీకృత ప్రాతిపదికన

2019-20 డిసెంబర్​ త్రైమాసికంలో... పీఎన్​బీ రూ.501.93 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నివేదించింది. 2018-19 ఇదే సమయంలో బ్యాంకు ఏకీకృత నష్టం కేవలం రూ.249.75 కోట్లు మాత్రమే. మొత్తంగా చూసుకుంటే ఈ త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ.16,211.24 కోట్లు. గతేడాది ఇది రూ.15,104.94 కోట్లుగా ఉంది. దీనికి ప్రధానకారణం గతేడాది రూ.2,636.09 కోట్లున్న మొండిబకాయిలు రూ.4,471 కోట్లకు పెరిగిపోవడమే. పీఎన్​బీ ఏకీకృత ఫలితాల్లో దాని 5 అనుబంధ సంస్థలు, ఏడు అసోసియేట్ కంపెనీలు, ఒక జాయింట్ వెంచర్​ నుంచి వచ్చిన ఆదాయాలు కలిసి ఉన్నాయి.

నిరర్ధక ఆస్తులు

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు నిరర్ధక ఆస్తులు గుదిబండలా వెంటాడుతూనే ఉన్నాయి. అయితే గతేడాది 16.33 శాతంగా ఉన్న నిరర్ధక ఆస్తులు ఈ ఏడాదికి స్వల్పంగా తగ్గి 16.30 శాతానికి చేరుకున్నాయి.

పీఎన్​బీ ఇన్సూరెన్స్​ బ్రోకింగ్​

నష్టాలతో, మొండి బకాయిలతో, నిరర్ధక ఆస్తులతో సతమతమవుతున్న పీఎన్​బీ... 2011 ఫిబ్రవరిలో ఇన్సూరెన్స్ బ్రోకింగ్ కోసం పొందిన లైసెన్స్​ను వదులుకుని.. దానిని మూసివేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

Last Updated : Feb 29, 2020, 4:51 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details