పేటీఎం వినియోగదారులు తమ ఈ-వ్యాలెట్‌లోకి క్రెడిట్‌కార్డుల ద్వారా నగదు వేసుకోవాలంటే ఇకపై 2 శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 10 వేల రూపాయలకు మించి నగదును జమ చేసే వారికి ఈ నిబంధన వర్తించనున్నట్లు సంస్థ తెలిపింది. వినియోగదారులు క్రెడిట్‌కార్డు వినియోగించి వ్యాలెట్‌కు నగదు బదిలీ చేసేందుకు ఆయా బ్యాంకులు.. అధిక ఛార్జీలను విధిస్తుండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఫలితంగా క్రెడిట్‌కార్డు లావాదేవీలపై 2 శాతం నామినల్ ఛార్జీని వసూలు చేస్తున్నట్లు తెలిపింది.
పేటీఎం షాక్: వ్యాలెట్‌లోకి నగదు బదిలీపై 2% ఛార్జీ! - పేటీఎం తాజా వార్తలు
వినియోగదారులకు పేటీఎం సంస్థ షాకిచ్చింది. క్రెడిట్‌కార్డు ద్వారా వ్యాలెట్‌కు నగదు బదిలీ చేసుకుంటే 2% రుసుము వసూలు చేయనుంది. బ్యాంకులు అధిక ఛార్జీలు వడ్డిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది.
వినియోగదారులకు పేటీఎం షాక్.. నగదు బదిలీపై 2% ఛార్జీ
యూపీఐ, డెబిట్‌కార్డుల ద్వారా ఎలాంటి రుసుములు లేకుండా నగదును వ్యాలెట్‌లోకి బదిలీ చేసుకోవచ్చని పేటీఎం సంస్థ వెల్లడించింది. తాజా ఛార్జీలు క్రెడిట్‌కార్డు ద్వారా వ్యాలెట్‌కు నగదు బదిలీ చేసే వారికి మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది.
ఇవీ చూడండి: