తెలంగాణ

telangana

ETV Bharat / business

2020-21లో చమురు సంస్థల పెట్టుబడుల్లో భారీ వృద్ధి - వ్యాపార వార్తలు

రానున్న ఆర్థిక సంవత్సరంలో చమురు నిక్షేపాల అన్వేషణ, విస్తరణ దిశగా ప్రభుత్వ రంగ సంస్థలు భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. దాదాపు అన్ని సంస్థలు కలిపి మొత్తం రూ.98,521 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నాయి.

INVEST
చమురు సంస్థల పెట్టుబడుల్లో వృద్ధి

By

Published : Feb 2, 2020, 5:36 PM IST

Updated : Feb 28, 2020, 9:56 PM IST

భారత్ అత్యంత వేగంగా చమురు వినియోగ దేశంగా మారుతున్న నేపథ్యంలో చమురు నిక్షేపాల అన్వేషణ, విస్తరణ దిశగా పెట్టుబడులకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి ఇంధన సంస్థలు. రానున్న ఆర్థిక సంవత్సరం (2020-21) ఓఎన్​జీసీ, ఐఓసీ సహా అన్ని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఈ దిశగా రూ.98,521 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నాయి. ముఖ్యంగా చమురు, గ్యాస్ రిఫైనరీస్​, పెట్రోకెమికల్స్​ అన్వేషణ కోసం ఈ వ్యయాన్ని చేయనున్నాయి.

చమురు నిక్షేపాల నిర్ధరణ కోసం వ్యాపారసంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించిన రూ.94,974 కోట్లతో పోలిస్తే.. రానున్న ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన మొత్తం దాదాపు 4 శాతం ఎక్కువ.

సంస్థల వారీగా పెట్టుబడులు..

ఓఎన్​జీసీ గతంతో పోలిస్తే 19 శాతం వృద్ధితో రూ.32,501 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ముఖ్యంగా కొత్త చమురు నిక్షేపాలు కనుగొనడం సహా.. ఇప్పటికే కనుగొన్న వాటి నుంచి ఉత్పత్తి ప్రారంభించేందుకు ఈ నిధులను ఖర్చు చేయనుంది. ఇదే సంస్థకు చెందిన ఓఎన్​జీసీ విదేశ్​ లిమిటెడ్​ 10 శాతం పెంపుతో రూ.7,235 కోట్లు వచ్చే ఆర్థిక సంవత్సరం పెట్టుబడులు పెట్టనుంది.

మరో దిగ్గజ సంస్థ ఐఓసీ రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.26,233 కోట్లను సంస్థ విస్తరణ, రిఫైనరీల నవీకరణ కోసం మూలధన వ్యయంగా ఖర్చు చేయనుంది. పెట్రోకెమికల్ వ్యాపారాలపై మరో రూ.3,387.5 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది.

ప్రైవేటీకరణకు సిద్ధమైన భారత్​ పెట్రోలియం కార్పొరేషన్ రూ.9,000 కోట్లను సంస్థకు చెందిన రిఫైనరీ వ్యాపారాలపై మూలధన వ్యయంగా ఖర్చు చేయనుంది.

ఇక గెయిల్​ రూ.5,412 కోట్లు, హెచ్​పీసీఎల్​-రూ.11,500 కోట్లు, ఆయిల్ ఇండియా రూ.3,877 కోట్ల చొప్పున పెట్టుబడులు పెట్టనున్నాయి.

ఇదీ చూడండి:బీమా దిగ్గజం 'ఎల్​ఐసీ' ఐపీఓ ఎప్పుడో తెలుసా?

Last Updated : Feb 28, 2020, 9:56 PM IST

ABOUT THE AUTHOR

...view details