తెలంగాణ

telangana

ETV Bharat / business

'వన్ ప్లస్' కొత్త మోడళ్లు వచ్చేస్తున్నాయ్

స్మార్ట్​ఫోన్ తయారీ సంస్థ 'వన్​ప్లస్' మార్కెట్లోకి కొత్త మోడళ్లు విడుదల చేసింది. వన్​ ప్లస్ 7, 7 ప్రో పేరుతో వస్తున్న ఈ ఫోన్లు.. ఆన్​లైన్​లో ఈ నెల 17 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

వస్తున్నాయ్ 'వన్ ప్లస్' కొత్త మోడళ్లు

By

Published : May 15, 2019, 9:47 AM IST

ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ 'వన్‌ ప్లస్‌' మెరుగైన డిజైన్‌, కెమెరాలతో 7, 7 ప్రో మోడళ్లను మంగళవారం బెంగళూరులో ఆవిష్కరించింది. ఈ నెల 17 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి ఉంటాయని కంపెనీ ప్రకటించింది. అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యులు ఒక రోజు ముందుగానే వీటిని కొనుగోలు చేయొచ్చు.

వన్‌ ప్లస్‌ 7 -రెండు వేరియంట్లు

(6జీబీ+ 128జీబీ) -ధర రూ.32,999.
(8జీబీ+256జీబీ) -ధర రూ.37,999.

వన్‌ ప్లస్‌ 7ప్రో- మూడు వేరియంట్లు

6జీబీ+ 128జీబీ -ధర రూ.48,999.
8జీబీ+ 256జీబీ -ధర రూ.52,999.
12జీబీ+ 256జీబీ -ధర రూ.57,999.

అదనపు ప్రత్యేకతలు

వన్‌ప్లస్‌ 7 ప్రోలో 6.7 అంగుళాల ఫ్లూయిడ్‌ అమోలెడ్ తెర, ట్రిపుల్ కెమెరా(48+16+8 మెగా పిక్సెల్), 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం, డాల్బీ అట్మోస్‌ డబుల్‌ స్పీకర్లు, ఆండ్రాయిడ్‌ క్యూ వెర్షన్‌ అదనపు ప్రత్యేకతలు.

ABOUT THE AUTHOR

...view details