తెలంగాణ

telangana

ETV Bharat / business

భారీ నష్టాల్లో ఓలా- తప్పని ఉద్యోగాల కోత

ప్రముఖ క్యాబ్​ సర్వీస్​ సంస్థ ఓలా బుధవారం కీలక ప్రకటన చేసింది. ఓలా రైడ్స్​, ఆర్థిక సేవలు, ఫుడ్​ డెలివరీ రంగాల నుంచి 1,400 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది. గడిచిన 2 నెలల్లో తమ సంస్థ 95శాతం నష్టాలు చవిచూడడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Ola to layoff 1,400 staff as COVID-19 pandemic hits revenues
భారీ నష్టాల్లో ఓలా... తప్పని ఉద్యోగాల కోత

By

Published : May 20, 2020, 3:54 PM IST

ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా ప్రభావం ప్రముఖ క్యాబ్​ సర్వీస్ సంస్థ ఓలా పైనా పడింది. వైరస్​ కారణంగా విధించిన లాక్​డౌన్​ వల్ల గడిచిన రెండు నెలల్లో 95 శాతం నష్టాలు చవిచూసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఓలా రైడ్స్​, ఆర్థిక సేవలు, ఫుడ్​ డెలివరీ రంగాల నుంచి 1,400 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు సంస్థ సీఈఓ భావిష్‌ అగర్వాల్​ బుధవారం తెలిపారు. తొలగింపునకు కారణాలను వివరిస్తూ.. ఇ-మెయిల్​ ద్వారా ఉద్యోగులకు సమాచారం అందించారు.

ఈ వైరస్​ మా పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపింది. గత 2 నెలల్లో మా ఆదాయం 95శాతం తగ్గిపోయింది. ముఖ్యంగా, దేశంలోని లక్షలాది మంది డ్రైవర్లు, వారి కుటుంబాల జీవనోపాధి కష్టతరంగా మారింది.

-భావిష్​ అగర్వాల్, ఓలా సంస్థ సీఈఓ​

లాక్​డౌన్ ప్రకటించినప్పటి నుంచి చాలా కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్​ ఫ్రం హోంకు పరిమితం చేశాయని తెలిపారు అగర్వాల్​. విమాన ప్రయాణాలు నిలిపివేసి, విహార యాత్రలకు అనుమతించకోవడం వల్ల నెలకొన్న సంక్షోభం.. తమ సంస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపనున్నట్లు తెలిపారు.

చిరుకానుకలతో ఊరట...

ప్రభావిత ఉద్యోగులకు నోటీసులతో సంబంధం లేకుండా 3 నెలల ఆర్థిక భృతిని అందించనున్నట్లు అగర్వాల్​ తెలిపారు. సంస్థలో ఎక్కువకాలం పనిచేసిన ఉద్యోగులకు అధిక మొత్తంలో చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబరు 31 వరకు వైద్య, ప్రమాద, జీవిత బీమా సదుపాయాలను కల్పిస్తామని అగర్వాల్​ వివరించారు. ప్రతి ఉద్యోగి తల్లిదండ్రులకు వైద్య బీమా అందించాలని కంపెనీ నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.

గతవారంలో ప్రముఖ ఫుడ్​ డెలివరీ సంస్థలైన ఉబర్​, జోమాటో, స్వీగ్గీలు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి.

ABOUT THE AUTHOR

...view details