వాహనప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఓలా' ఎలక్ట్రిక్ స్కూటర్(ఈ- స్కూటర్) విడుదలకు సిద్ధమైంది. స్వాతంత్య్ర దినోత్సవం(ఆగస్టు 15) పురస్కరించుకుని ఆదివారం నుంచి ఇవి మార్కెట్లోకి రానున్నాయి. మొత్తంగా పది రంగుల్లో ఇవి అందుబాటులో ఉంటాయని సంస్థ పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియోను ఓలా ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసింది.
ఓలా స్కూటర్ రంగులు ఇలా..
నలుపు (మ్యాట్, గ్లాస్ ఫినిషింగ్)
నీలం (మ్యాట్, గ్లాస్ ఫినిషింగ్)
ఎరుపు
పింక్
పసుపు
తెలుపు
సిల్వర్
ఓలా స్కూటర్ గురించి మరిన్ని అంశాలు..
ఓలా స్కూటర్ ధరను కంపెనీ ఇంకా నిర్ణయించలేదు. ప్రాథమిక అంచనాలు ప్రకారం సుమరుగా రూ.80 వేల నుంచి రూ. లక్ష వరకూ ఉండొచ్చని అంచనా.
జులై 15న ఓలా సంస్థ.. ఈ-స్కూటర్ బుకింగ్స్ ప్రారంభించింది. రిజిస్ట్రేషన్ ప్రారంభమైన 24 గంటల్లోనే ఈ-స్కూటర్లకు లక్ష బుకింగ్‌లు రావడం విశేషం.
అడ్వాన్స్ బుకింగ్ కోసం వినియోగదారుల నుంచి రూ. 499 వసూలు చేసింది ఓలా.
ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి సంస్థ స్కూటర్లను డోర్ డెలివరీ ఇవ్వనుంది.
'మేడ్ ఇన్ ఇండియా' నుంచి విదేశాలకు ఈ స్కూటర్లు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఓలా. ఇందుకు సంబంధించి ఉత్పత్తి కేంద్రాన్ని తమిళనాడులోని ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసింది.
మొదటిదశలో భాగంగా ఏడాదికి 20 లక్షల స్కూటర్లను తయారు చేస్తున్నట్లు సంస్థ ఇప్పటికే ప్రకటించింది. వచ్చే ఏడాదికి ఈ సంఖ్య కోటికి చేరవచ్చని అంచనా.
రుణ సదుపాయం కోసం ఓలా ఎలక్ట్రిక్ పదేళ్ల కాలానికి బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ-స్కూటర్ల కోసం దేశవ్యాప్తంగా 400 నగరాల్లో లక్ష ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనుంది ఓలా. ఛార్జింగ్ స్టేషన్లను దూర ప్రాంతాల్లో కాకుండా, షాపింగ్ మాల్స్, ఐటీ పార్కులు, ఆఫీస్ కాంప్లెక్స్‌లు, కెఫ్ల వంటి ప్రదేశాల్లోనే ఏర్పాటు చేయనుంది.
ఓలా స్కూటర్లో ఇన్స్టాలేషన్ అవసరం లేని హోమ్ ఛార్జర్ కూడా ఉంటుంది. ఈ ఛార్జర్‌తో 18 నిమిషాల్లో 50 శాతానికి పైగా ఛార్జ్ చేయవచ్చు. తద్వారా 75 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోనూ తమ ఈ-స్కూటర్లను విక్రయించేందుకు సన్నాహాలు జరుపుతోంది ఓలా.
ఇదీ చూడండి: ఓలా ఈ- స్కూటర్.. రంగు అదుర్స్!