తెలంగాణ

telangana

ETV Bharat / business

లండన్​లో ఆస్తులు కొనే భారతీయులు 11 శాతం వృద్ధి..

లండన్​లో స్థిరాస్తి కొనుగోలు చేసే భారతీయుల సంఖ్య ఏడాది కాలంలో 11 శాతం పెరిగినట్లు ఓ సర్వేలో తెలిసింది. స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకునే సంపన్న భారతీయులకు లండన్​ ఒక ప్రధాన నగరంగా ఉన్నట్లు సర్వే పేర్కొంది.

లండన్​లో ఆస్తులు కొనే భారతీయులు 11 శాతం వృద్ధి..

By

Published : Nov 15, 2019, 5:31 AM IST

లండన్​లో స్థిరాస్తి కొనుగోలు చేసే భారతీయులు భారీగా పెరుగుతున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. స్థిరాస్తి సేవల సంస్థ నైట్​ ఫ్రాంక్​ విడుదల చేసిన ఓ నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

ఈ నివేదిక ప్రకారం 2019 జూన్​తో ముగిసిన ఏడాది కాలానికి.. లండన్​లో స్థిరాస్తులు కొనుగోలు చేసే భారతీయుల సంఖ్య 11 శాతం పెరిగింది. భారత్​లోని సంపన్నులకు.. స్థిరాస్తి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపే నగరాల్లో లండన్​ ప్రముఖంగా ఉన్నట్లు నైట్​ ఫ్రాంక్ సంస్థ వెల్లడించింది.

భారతీయులు లండన్​లో స్థిరాస్థి కొనుగోలు చేసే ప్రాంతాల్లో మైఫైర్​, బెల్​గ్రావియా, హైడై పార్క్, మెరిల్​బోన్​, సెయింట్​ జాన్స్ ఉడ్​లు ప్రధానంగా ఉన్నాయి. దాదాపు 20 శాతం డిస్కౌంట్​తో జరిగిన విక్రయాలు.. భారతీయులకు మేలు చేకూర్చినట్లు నైట్​ ఫ్రాంక్ అభిప్రాయపడింది.

ఇదీ చూడండి: భారత జీడీపీ వృద్ధి రేటు మరోసారి తగ్గించిన మూడీస్​

ABOUT THE AUTHOR

...view details