తెలంగాణ

telangana

ETV Bharat / business

'బ్యాంకు ఖాతాల కోసం మతం చెప్పాల్సిన పని లేదు' - తెలుగు బిజినెస్ వార్తలు

దేశంలో బ్యాంకు ఖాతా తెరిచేందుకు మతం పేర్కొనాలన్న వదంతులను నమ్మొద్దని ఆర్థిక కార్యదర్శి రాజీవ్​ కుమార్ అన్నారు. ఖాతాలు తెరిచేందుకు, కేవైసీ అవసరాలకు మతం తెలపాల్సిన అవసరం లేదని స్పష్టతనిచ్చారు రాజీవ్​.

FINANCE MINISTRY
ఆర్థిక శాఖ

By

Published : Dec 22, 2019, 1:47 PM IST

భారత పౌరులు బ్యాంకు ఖాతా తీసుకోవాలంటే మతం తెలపాలన్న పుకార్లను ఖండించారు ఆర్థిక కార్యదర్శి రాజీవ్​ కుమార్​. పౌరులెవ్వరూ బ్యాంకు ఖాతా తెరిచేందుకు, కేవైసీ అవసరాలకు మతం తెలపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

తమ డిపాజిటర్లు, వినియోగదారులను బ్యాంకులు.. మతం తెలపాలని అడిగే అవకాశముందని పలు వార్తలు బయటికొచ్చిన నేపథ్యంలో.. ఈ మేరకు స్పష్టతనిచ్చారు రాజీవ్ కుమార్​.

"భారత పౌరులు బ్యాంకు ఖాతా తెరిచేందుకు, పాత వినియోగదారులు కేవైసీ కోసం తమ మతాన్ని తెలపాల్సిన అవసరం లేదు. బ్యాంకులపై వచ్చే ఇలాంటి వదంతులు నమ్మకండి." - రాజీవ్​ కుమార్​ ట్వీట్

ఇదీ చూడండి:అత్యంత యువ సంపన్నుల్లో బెంగళూరోళ్లు భళా!

ABOUT THE AUTHOR

...view details