వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీకి విధించిన జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 22 వరకు పొడిగించింది లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు. అప్పటివరకు రిమాండ్‌లోనే ఉండనున్నారు. ప్రస్తుతం వాండ్స్‌వర్త్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నీరవ్ ఈ రోజు వీడియో లింక్ ద్వారా విచారణకు హాజరయ్యారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 2 బిలియన్ డాలర్ల రుణాల ఎగవేత సహా మనీలాండరింగ్ కేసులో నీరవ్ నిందితుడిగా ఉన్నారు.
భారత్‌కు అప్పగించే అంశంపై అన్ని వర్గాల పరస్పర అంగీకారంతో.. 2020 మేలో ఐదు రోజుల విచారణ జరిపే అవకాశమున్నట్లు కోర్టు పేర్కొంది. ఆయనను స్వదేశానికి రప్పించాలని భారత్ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది.