వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం 'నెట్‌ఫ్లిక్స్' వినియోగదారులను భారీగా పెంచుకునేందుకు ప్రణాళికలు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న వీడియో ఆన్ డిమాండ్ సంస్థలకు గట్టిపోటీని ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకోసం రూ.250 నెలవారీ చందాతో నెట్‌ఫ్లిక్స్ సభ్యత్వాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ సభ్యత్వం ద్వారా ఒక సారి కేవలం ఒక మొబైల్లో మాత్రమే కంటెంట్‌ను చూసేందుకు అనుమతించనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ సాధారణ చందా నెలకు రూ.500గా ఉంది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో రూ.250 చందా ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది నెట్‌ఫ్లిక్స్.
"ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఈ చౌక ధర ప్లాన్‌ను ఆవిష్కరించనున్నాం. దీని ద్వారా భారత్‌లో పెద్ద సంఖ్యలో యూజర్లకు నెట్‌ఫ్లిక్స్‌ను పరిచయం చేస్తామని భావిస్తున్నాం."
-నెట్‌ఫ్లిక్స్