తెలంగాణ

telangana

ETV Bharat / business

నెట్​ఫ్లిక్స్ బంపర్ ఆఫర్​ రూ.199కే సభ్యత్వం - నెలవారీ

అమెజాన్, హాట్ స్టార్​ వంటి ప్రీమియం కంటెంట్ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది నెట్​ఫ్లిక్స్. భారత వినియోగదారులకు రూ.199కే నెలవారీ చందాతో సరికొత్త ప్లాన్​ను ఆవిష్కరించింది.

నెట్​ఫ్లిక్స్ బంపర్ ఆఫర్​ రూ.199కే సభ్యత్వం

By

Published : Jul 25, 2019, 5:31 AM IST

ప్రీమియం వీడియో స్ట్రీమింగ్ సంస్థ నెట్​ ఫ్లిక్స్ భారత యూజర్లకు రూ.199కే నెలవారీ చందాతో సరికొత్త ప్లాన్​ను ఆవిష్కరించింది. అమెజాన్ సహా ఇతర స్థానిక సంస్థల నుంచి వస్తున్న పోటీని ఎదుర్కొనేందుకు నెట్​ఫ్లిక్స్ ఈ ప్లాన్​ను అందుబాటులోకి తెచ్చింది. గత కొన్ని నెలలుగా భారత్​లో మొబైల్ ఓన్లీ ప్లాన్​పై ట్రయల్ నిర్వహిస్తోంది నెట్​ఫ్లిక్స్. ఈ ఆఫర్​లో సభ్యత్వం తీసుకున్న వినియోగదారులు కేవలం ఒక సారి ఒక మొబైల్​లో మాత్రమే కంటెంట్​ను వీక్షించొచ్చు. తక్షణమే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాట్లు నెట్ ఫ్లిక్స్ పేర్కొంది.

ప్రస్తుతం అమెజాన్, హాట్ స్టార్, జీ5 రూ.999ల వార్షిక చందాతో ప్రీమియం కంటెంట్​ను అందిస్తున్నాయి. నెట్​ఫ్లిక్స్ తాజా ఆఫర్​తో ఆయా సంస్థలకు గట్టి పోటీ ఎదురుకానుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న మూడు ప్లాన్​లను కూడా సవరించింది నెట్​ ఫ్లిక్స్.

స్మార్ట్ ఫోన్ వినియోగంలో యూజర్లు 30 శాతం సమయాన్ని ఎంటర్​టైన్మెంట్ కంటెంట్​ కోసం వెచ్చిస్తున్నారు. ముఖ్యంగా జియో వచ్చిన తర్వాత ఈ వినియోగం మరింత పెరిగింది. స్మార్ట్​ ఫోన్​లో అధికంగా నెట్​ఫ్లిక్స్​ కంటెంట్​ను వినియోగిస్తున్న దేశం భారత్. ఈ సానుకూలతలన్నింటిని అందిపుచ్చుకునేందుకుని వినియోగదారులను పెంచుకోవాలని భావిస్తున్నట్లు నెట్​ఫ్లిక్స్ ఇండియా డైరెక్టర్ అజయ్ అరోరా తెలిపారు.

ఇదీ చూడండి:జీఐఐ ర్యాంకింగ్​లో భారత్​కు 52వ స్థానం

ABOUT THE AUTHOR

...view details