తెలంగాణ

telangana

ETV Bharat / business

'ఊహకందని వ్యూహాలతోనే 5 ట్రిలియన్లు​ సాధ్యం'

భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం తలపెట్టిన 5 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థను అందుకోవలంటే ఊహకందని వ్యూహాలు అమలు చేయాలని అభిప్రాయపడ్డారు.

'ఊహకందని వ్యూహాలతోనే 5 ట్రిలియన్​ సాధ్యం'

By

Published : Sep 8, 2019, 6:01 AM IST

Updated : Sep 29, 2019, 8:30 PM IST

'ఊహకందని వ్యూహాలతోనే 5 ట్రిలియన్లు​ సాధ్యం'

భారత్..​ 5 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలంటే ఊహకు అందని వ్యూహాలను అమలు చేయాలని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్​ సింగ్​ అభిప్రాయపడ్డారు. దేశంలో ఆర్థిక వృద్ధి మందగించడంపై మన్మోహన్​ ఆవేదన వ్యక్తం చేశారు.

"ప్రస్తుతం మన ఆర్థిక వృద్ధి మందగిస్తున్నట్లు తెలుస్తోంది. జీడీపీ రేటు క్షీణిస్తోంది. పెట్టుబడులు స్తబ్తుగా ఉన్నాయి. రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకింగ్​ వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుంది. నిరుద్యోగ సమస్య వెంటాడుతోంది. వీటన్నింటిని దాటుకుని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను రూపొందించే వ్యూహాలు అమలు చేయాలి."

- మన్మోహన్​ సింగ్​, మాజీ ప్రధానమంత్రి

దేశాభివృద్ధి, పాలన, ఆర్థిక వ్యవస్థకు మన్మోహన్ సేవలకుగానూ జేకే లక్ష్మీపత్ యూనివర్సిటీ 'జేకేఎల్​యూ లిటరేచర్​ అవార్డు 2019'ను అందించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

పన్నులు తగ్గించి.. అన్ని స్థాయుల్లోని వ్యవస్థలకు స్వతంత్ర అధికారాలను కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు మన్మోహన్​ సింగ్.

దేశానికి ప్రస్తుతం జనాభా, సామాజిక అసమానతలు, మతోన్మాదం, అవినీతి వంటి సవాళ్లు ఎదురవుతున్నాయని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. విద్య, కులతత్వాన్ని తొలగించడం, మహిళా సాధికారత, శిశుసంక్షేమం, మీడియా స్వేచ్ఛ, ఆర్థిక వృద్ధి ద్వారా ఆ సవాళ్లను ఎదుర్కోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: 'సవాళ్లు అధిగమించేందుకు సాధ్యమైనంత సాయం'

Last Updated : Sep 29, 2019, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details