స్టాక్ మార్కెట్లు ఈ వారం రేంజ్ బౌండ్ ట్రేడింగ్‌లో కొనసాగే అవకాశముంది. ఈ వారం మార్కెట్లు పని చేసే రోజులు తగ్గడం సహా దిగ్గజ కంపెనీల త్రైమాసిక ఫలితాలు.. మార్కెట్ల గమనాన్ని నిర్దేశించే అవకాశముందని నిపుణులు అంటున్నారు.
విజయదశమి సందర్భంగా ఈ నెల 8న మార్కెట్లకు సెలవు. ఈ కారణంగా ఈ వారం 4 రోజులే మార్కెట్లు పని చేయనున్నాయి.
రెండో త్రైమాసిక ఫలితాల సీజన్‌ను టెక్ దిగ్గజం టీసీఎస్ ప్రారంభించనుంది. గురువారం ఈ సంస్థ ఫలితాలు ప్రకటించనుండగా.. ఇన్ఫోసిస్ శుక్రవారం వెల్లడించనుంది.
"ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసిక ఫలితాల సీజన్ మొదలైంది. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఫలితాలతో కొన్ని కీలక రంగాల్లో అస్థిరతలు ఏర్పడొచ్చు."
- ముస్తఫా నదీమ్, ఎపిక్ రీసర్చ్ సీఈఓ
మార్కెట్లను ప్రభావితం చేసే దేశీయ కారణాలివే..