మార్కెట్లోకి భారత్ స్టేజ్ VI ఉద్గార నియమాలు పాటించే మోడళ్లు విడుదలైన ఆరు నెలల్లోనే.. 2 లక్షల యూనిట్లు విక్రయించినట్లు మారుతీ సుజుకీ ఇండియా వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఆల్టో 800, బాలినో మోడళ్లను బీఎస్ VI ఇంజిన్తో మార్కెట్లోకి విడుదల చేసింది ఈ ఆటోమొబైల్ దిగ్గజం.
ప్రస్తుతమున్న 16 మోడళ్లలో 8 కార్లు బీఎస్ VI కాలుష్య నియమాలు పాటించేవేనని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈఓ కెనిచి అయూకవ తెలిపారు.