లక్ష్మీ విలాస్ బ్యాంక్(ఎల్వీబీ)లో డిపాజిటర్లు దాచుకున్న సొమ్ము సురక్షితమేనని ఆర్బీఐ నియమించిన పాలనాధిపతి టి.ఎన్.మనోహరన్ స్పష్టం చేశారు. డిపాజిటర్ల డబ్బు తిరిగి చెల్లించేందుకు సరిపడ లిక్విడిటీ ఎల్‌వీబీలో ఉన్నట్లు వెల్లడించారు.
ఆర్బీఐ విధించిన గడువులోపు డీబీఎస్‌తో లక్ష్మీ విలాస్ బ్యాంక్ వీలినం పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేశారు టీఎన్ మనోహరన్. విలీనానికి సంబంధించి.. ఆర్బీఐ ఈ నెల 20న తుది ముసాయిదాను జారీ చేయనుంది.
ఆర్థిక స్థితి క్షీణిస్తున్న నేపథ్యంలో.. లక్ష్మీ విలాస్ బ్యాంక్‌పై కేంద్రం మంగళవారం 30రోజుల మారటోరియం విధించింది. ఈ నేపథ్యంలో ఎల్వీబీ ప్రస్తుత బోర్డును రద్దు చేసిన ఆర్బీఐ.. కెనరా బ్యాంకు మాజీ నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ టీఎన్ మనోహరన్‌ను పాలనాధిపతిగా నియమించింది.