తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాలిస్తే... ప్రభుత్వ ప్రోత్సాహకం!

ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం పరిశ్రమ వర్గాలతో చర్చలు జరుపుతోంది కార్మిక మంత్రిత్వ శాఖ. ఈ పథకంతో ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడం సహా సామాజిక, ఆర్థిక భద్రత కలుగుతుందని కేంద్రం భావిస్తోంది.

By

Published : Sep 26, 2019, 5:39 PM IST

Updated : Oct 2, 2019, 2:52 AM IST

ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాలిస్తే... ప్రభుత్వ ప్రోత్సాహం!

ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు.. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇచ్చే ఓ పథకాన్ని తీసుకురావాలని భావిస్తోంది కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ. సీఐఐ, అసోచామ్ వంటి పరిశ్రమ వర్గాలు ఈ విధానానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి.

ఈ పథకానికి సంబంధించి పరిశ్రమ వర్గాలతో ఇంకా చర్చలు జరుగుతున్నాయని కార్మిక శాఖ మంత్రి సంతోష్​ గంగ్వార్ తెలిపారు. ఈ సంప్రదింపుల్లో పరిశ్రమ వర్గాల నుంచి అనేక సలహాలు అందినట్లు పేర్కొన్నారాయన. వాటన్నింటినీ పరిశీలించి తుది నిర్ణయం త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

ఇప్పటికే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్​ఓ).. 136 ప్రాంతీయ కార్యాలయాల నుంచి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్నట్లు ఓ సీనియర్ ప్రభుత్వాధికారి తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు సమాన అవకాశాలు, నియామకాలను ప్రోత్సహించడం కోసం నీతి ఆయోగ్​ చేపట్టిన అధ్యయనంలో భాగంగా ఈ డేటాను సేకరిస్తున్నట్లు వెల్లడించారు.

ఇంతకీ ఈ పథకం ఏంటంటే..

కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి ఈపీఎఫ్​ఎఫ్​ఓ సామాజిక భద్రత పథకాలు అందిస్తుంది. ఇందుకోసం కొంత మొత్తాన్ని ఆయా సంస్థల నుంచి సేకరిస్తుంది. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రోత్సాహకం అమలైతే.. కంపెనీలు చెల్లించే మొత్తాన్ని ప్రభుత్వం భరించనుంది. ఇలా మూడేళ్ల వరకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది. ఈ పథకం 2018 ఏప్రిల్​ నుంచి వర్తించనుంది.

ఇదీ చూడండి: భారత్​లో శాంసంగ్ మడత ఫోన్ ధరెంతో తెలుసా!

Last Updated : Oct 2, 2019, 2:52 AM IST

ABOUT THE AUTHOR

...view details