తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎల్&టీ చేతికి 'బుల్లెట్ ట్రైన్' ప్రాజెక్టు!

ముంబయి-అహ్మదాబాద్​ మధ్య హై స్పీడ్ రైల్ (బుల్లెట్ ట్రైన్) నిర్మాణంలో భాగమైన ఓ ప్రాజెక్టును లార్సెన్​ టూబ్రో దక్కించుకుంది. ఎంత మొత్తానికి ఈ ప్రాజెక్టును దక్కించుకుందనే విషయాన్ని ఆ సంస్థ వెల్లడించలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం దీని విలువ రూ.7 వేల కోట్లు అని అంచనా.

L&T secured another Mega contract
బుల్లెట్ ట్రైన్ నిర్మాణ విభాగం ప్రాజెక్టు లార్సెన్ చేతికి

By

Published : Nov 19, 2020, 1:36 PM IST

మౌలిక వసతుల సంస్థ లార్సెన్ టూబ్రో (ఎల్​&టీ) మరో భారీ ప్రాజెక్టును దక్కించుకుంది. ముంబయి-అహ్మదాబాద్​ మధ్య హై స్పీడ్ రైల్ (బుల్లెట్ ట్రైన్) నిర్మాణంలో భాగమైన ప్రాజెక్టు చేజిక్కించుకున్నట్లు ప్రకటించింది.

ఎంత మొత్తానికి ఈ ప్రాజెక్టును దక్కించుకుందనే విషయాన్ని మాత్రం ఎల్​&టీ వెల్లడించలేదు. ఇప్పటి వరకు ఉన్న వివరాల ప్రకారం ప్రాజెక్ట్​ విలువ రూ.7,000 కోట్లు అని తెలిసింది.

87.569 కిలో మీటర్లకు సంబంధించిన ఈ ప్రాజెక్ట్ పరిధిలో చిన్న వంతెనలు, ఒక స్టేషన్, నదిపై ఓ ప్రధాన బ్రిడ్జ్​ నిర్మాణాలు సహా డిపోల నిర్వహణ వాటి అనుబంధ పనులు ఉన్నాయి.

ఇదీ చూడండి:'అక్టోబర్​లో 57 శాతం తగ్గిన విమాన ప్రయాణికులు'

ABOUT THE AUTHOR

...view details