పబ్ జీ.. మాతృ సంస్థ క్రాఫ్టన్ భారతీయ గేమ్ లవర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ సంస్థ.. భారతీయ యూజర్ల కోసం కొత్త పేరుతో పబ్జీని పోలిన గేమ్‌ను తీసుకురానుంది. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో ఈ గేమ్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఈ సంస్థ నుంచి వచ్చిన పబ్జీకి భారత్‌లో మంచి ఆదరణ దక్కింది. అయితే దేశీయ అంతర్గత భద్రతకు ముప్పు ఉందనే కారణంతో పబ్జీ గేమ్ సహా 118 చైనా యాప్‌లను గతేడాది నిషేధించింది కేంద్రం.