తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత్​లోనూ పేరు మార్చుకున్న కియా - కియా కొత్త లోగో

ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా.. భారత్​లో అధికారికంగా పేరు మార్చుకున్నట్లు ప్రకటించింది. కియా మోటార్స్​గా ఉన్న పేరును ఇకపై కియా ఇండియాగా వ్యవహరించనున్నట్లు తెలిపింది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతుల తర్వాతే పేరును మార్చినట్లు స్పష్టం చేసింది.

Kia Changed Name and logo
కియా మోటార్స్ పేరు మార్పు

By

Published : May 24, 2021, 7:28 PM IST

దక్షిణా కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్​ కంపెనీ కియా.. భారత్​లో అధికారికంగా పేరు మార్చుకున్నట్లు సోమవారం ప్రకటించింది. ఇకపై కంపెనీని కియా ఇండియాగా వ్యవహరించనున్నట్లు తెలిపింది. ఇంతకు ముందు కియా మోటార్స్ పేరుతో భారత్​లో కార్యకలాపాలు సాగించింది ఈ సంస్థ.

కంపెనీ బ్రాండ్​కు​ ప్రత్యేక గుర్తింపునిచ్చేందుకు పేరు మార్చినట్లు కియా పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్​లో ఇదివరకే కియా మోటార్స్ పేరును కియా కార్పొరేషన్​గా మార్చుకోవడం గమనార్హం.

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురంలో ఉన్న ప్లాంట్​కు లోగోను మార్చినట్లు వెల్లడించింది కియా ఇండియా. డీలర్​షిప్​లకు దశల కొత్త పేరు, లోగోతో బోర్డులు మార్చనున్నట్లు వెల్లడించింది.

ఇదీ చదవండి:త్వరలో భారత్​కు​ బెనెలీ బడ్జెట్​ బైక్!

ABOUT THE AUTHOR

...view details