తెలంగాణ

telangana

ETV Bharat / business

అదిరే ఆఫర్లతో 'జియో ఫైబర్​'.. ఉచితంగా 4కే టీవీ! - 4కే టీవీ ఉచితం

రిలయన్స్ జియో ఫైబర్​ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అందరూ ఊహించినట్లుగానే బంపర్​ ఆఫర్లతో మార్కెట్లోకి ప్రవేశించింది. ప్రారంభ ఆఫర్ల కింద స్పీకర్లు, టీవీలను అందిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది. మరి జియో అందించే ప్లాన్​లు, ఉచిత సదుపాయాలను పొందాలంటే ఎలానో తెలుసుకోండి ఇప్పుడే.

జియో ప్రారంభం

By

Published : Sep 6, 2019, 5:01 AM IST

Updated : Sep 29, 2019, 2:49 PM IST

జియో ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'జియో ఫైబర్' సేవలు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు ఏడాది నిరీక్షణ తర్వాత సెప్టెంబర్​ 5న వాణిజ్య సేవలను ప్రారంభించింది రిలయన్స్​ జియో. అదిరే ఆఫర్లతో వివిధ ప్లాన్లను​ అందుబాటులోకి తెచ్చింది రిలయన్స్. బ్రాంజ్​, సిల్వర్​, గోల్డ్​, డైమండ్​, ప్లాటినం​, టైటానియం కేటగిరీలుగా జియో ఫైబర్​ ప్లాన్​లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్​లన్నింటిలో వార్షిక చందా తీసుకున్న వారికి సెట్​టాప్​ బాక్స్​, హోమ్​ గేట్​వేలను ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించింది. వీటితో పాటు ప్రతి ప్లాన్​కు స్పీకర్​, టీవీలు వంటివి అందిస్తోంది. మరి ఏ ప్లాన్​లో ఎలాంటి ఆఫర్లు ఇచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రాంజ్​

జియో ఫైబర్​లో అత్యంత చౌకైన ప్లాన్​ ఇదే (బ్రాంజ్​) అని చెప్పాలి. ఈ ప్లాన్ ఎంచుకున్న వినియోగదారులు రూ.699 నెలవారీ చందాతో 150 జీబీ డేటాను.. 100 ఎంబీపీఎస్​ వేగంతో వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత 1 ఎంబీపీఎస్​ వేగంతో ఇంటర్నెట్​​ వినియోగించుకునే అవకాశం ఉంది. ఇదే ప్లాన్​లో వార్షిక చందా రూ.8,388గా నిర్ణయించింది జియో. ఈ ప్లాన్ కింద వార్షిక చందా తీసుకున్న వారికి 6 వాట్ల బ్లూటూత్ స్పీకర్​ను ఉచితంగా ఇస్తోంది జియో.

సిల్వర్​

జియో సిల్వర్​ ప్లాన్​ తీసుకునే వినియోగదారు.. రూ.849 నెలవారీ చందాతో 100 ఎంబీపీఎస్​ వేగంతో ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు. 200 జీబీ+200 జీబీ అదనపు డేటా (మొత్తం 400 జీబీ డేటా)తర్వాత 1 ఎంబీపీఎస్​ వేగంతో ఇంటర్నెట్ వినియోగించుకునే వీలుంది. ఈ ప్లాన్​ వార్షిక చందాను రూ.10,188గా నిర్ణయించింది జియో. ఈ ప్లాన్​లో వార్షిక చందా తీసుకున్న వారికి 12 వాట్ల బ్లూటూత్​ స్పీకర్​ను ఉచితంగా అందిస్తున్నట్లు జియో వెల్లడించింది.

గోల్డ్​

గోల్డ్​ ప్లాన్​లో రూ.1,299 నెలవారీ చందాతో 250 ఎంబీపీఎస్​ వేగంతో ఇంటర్నెట్​ను వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది. 750 జీబీల డేటా తర్వాత 1 ఎంబీపీఎస్​ వేగంతో ఇంటర్నెట్ వినియోగించుకునే అవకాశం ఉండనుంది. గోల్డ్​ ప్లాన్ రూ.31,176లతో రెండేళ్ల వార్షిక చందా తీసుకున్న వినియోగదారులకు 24 అంగుళాల హెచ్​డీ టీవీ ఉచితంగా ఇవ్వనున్నట్లు జియో వెల్లడించింది.

డైమండ్

జియో డైమండ్ ప్లాన్​లో 500 ఎంబీపీఎస్​ వేగంతో ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు. 1500 జీబీ తర్వాత 1 ఎంబీపీఎస్ వేగంతో డేటాను వినియోగించుకోవచ్చు. రూ.2,499 నెలవారీ చందాతో ఈ ప్లాన్​ను అందిస్తోంది. డైమండ్​ ప్లాన్ వార్షిక చందాను రూ.29,988గా నిర్ణయించింది జియో. వార్షిక చందా తీసుకున్న వారికి 24 అంగుళాల హెచ్​డీ టీవీని ఉచితంగా ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

ప్లాటినమ్​

జియో ప్లాటినమ్​ ప్లాన్​ ద్వారా 1 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్​ను వినియోగించుకునే వీలుంది. 2500 జీబీల డేటా వినియోగించుకున్న తర్వాత.. 1 ఎంబీపీఎస్​ వేగంతో ఇంటర్నెట్​ వినియోగించుకోవచ్చు. ప్లాటినమ్ ప్లాన్ నెలవారీ చందాను రూ.3,999గా నిర్ణయించింది జియో. రూ.47,988లతో ప్లాటినమ్ వార్షిక చందా తీసుకున్న వారికి 32 అంగుళాల హెచ్​డీ టీవీని ఉచితంగా ఇవ్వనున్నట్లు జియో పేర్కొంది.

టైటానియం

జియో టైటానియం ప్లాన్​లోనూ 1 జీబీపీఎస్​ వేగంతో డేటాను వినియోగించుకునే అవకాశం కల్పిస్తోంది జియో. టైటానియం ప్లాన్​లో 5000 జీబీల డేటా పూర్తయిన తర్వాత.. 1 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్​ను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ నెలవారీ చందాను రూ.8,499గా నిర్ణయించింది జియో. రూ.1,01,988తో టైటానియం వార్షిక చందా తీసుకున్న వినియోగదారులకు.. 43 అంగుళాల 4కే టీవీని ఉచితంగా ఇవ్వనున్నట్లు జియో తెలిపింది.

ఈ ప్లాన్​లు పొందాలంటే రూ.2,500 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో రూ.1,000 ఇన్​స్టాలేషన్ ఛార్జీలు.. మిగతా రూ.1,500 సెక్యూరిటీ డిపాజిట్​గా తీసుకోనున్నట్లు రిలయన్స్ పేర్కొంది. జియో హోమ్ గేట్​వేతో పాటు వచ్చే ల్యాండ్​లైన్​తో భారత్​లో ఎక్కడికైనా ఉచిత వాయిస్, టీవీ వీడియోకాల్స్​ చేసుకోవచ్చు.

ఇదీ చూడండి: 'జియో ఫైబర్'​తో నట్టింట్లోనే అద్భుతాలు!

Last Updated : Sep 29, 2019, 2:49 PM IST

ABOUT THE AUTHOR

...view details