దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సంచలనాలు సృష్టిస్తోంది. అత్యధిక వినియోగదారులతో దేశంలోనే తొలిస్థానంలోఉన్న జియా.. తాజాగా మరో ఘనత సాధించింది. భారత్‌లో 40 కోట్ల వినియోగదారులను సొంత చేసుకున్న తొలి టెలికాం సంస్థగా అవతరించింది. టెలికాం నియంత్రణ సంస్థ తాజా నివేదిక ప్రకారం జులైలో 35 లక్షలకుపైగా కొత్త కస్టమర్లు చేరటం వల్ల ఈ మార్క్‌ను అందుకుంది జియో.
భారత మొబైల్ మార్కెట్లో 35.03 శాతంతో 40,08,03,819 మంది వినియోగదారులతో దూసుకెళుతోంది జియో. భారతీ ఎయిర్‌టెల్‌కు జులైలో 32.6 లక్షలు, బీఎస్ఎన్ఎల్కు 3.88 లక్షల మంది కొత్త వినియోగదారులు పెరిగారు. మరోవైపు వొడాఫోన్ ఐడియా.. 37 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది.
మొత్తం టెలికాం సబ్స్క్రైబర్స్ జులైలో 116.4 కోట్లకు చేరుకున్నారు. చరవాణి కనెక్షన్స్ పరంగా దేశంలో వినియోగదారుల సంఖ్య జులైలో 114.4 కోట్లకు చేరింది. అది జులైలో 114 కోట్లుగా ఉంది. అందులో పట్టణాల్లో(61.9) గ్రామీణ ప్రాంతాల్లో 52.1 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు ట్రాయ్.. నెలవారి సబ్స్క్రైబర్స్ నివేదిక వెల్లడించింది.