తెలంగాణ

telangana

ETV Bharat / business

వాయిదా పద్ధతిలో బీమా క్లెయిమ్​ల చెల్లింపుపై కసరత్తు - వాయిదా పద్దతిలో

వాయిదా పద్ధతిలో బీమా పాలసీల క్లెయిమ్​లు చెల్లించేందుకు వీలుకల్పించే అంశంపై ఐఆర్​డీఏఐ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం నూతన ముసాయిదాను తీసుకొచ్చింది. దీనిపై ఏప్రిల్​ 17 లోపు తమ అభిప్రాయాలు తెలపాలని సంబంధిత సంస్థలను కోరింది ఐఆర్​డీఏఐ.

ఐఆర్​డీఏఐ

By

Published : Apr 7, 2019, 7:00 PM IST

వ్యక్తిగత ప్రమాదం (పర్సనల్​ యాక్సిడెంట్​) సహా కొన్ని లాభదాయక ఆరోగ్య బీమా పథకాలపై వాయిదా పద్ధతిలో క్లెయిమ్​ను చెల్లించేందుకు వీలుకల్పించే అంశంపై ఇన్సూరెన్స్​​ రెగ్యులేటరి అథారిటీ ఆఫ్​ ఇండియా (ఐఆర్​డీఏఐ) కసరత్తు చేస్తోంది.

ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు గతేడాది నియమించిన కమిటీ... అన్ని రకాల పరిశీలనలు చేసిన తర్వాత ఈ ఏడాది జనవరిలో ఐఆర్​డీఏఐకు నివేదికను సమర్పించింది.

తాజాగా నూతన మార్గదర్శకాలతో కూడిన ముసాయిదాను తీసుకొచ్చింది ఐఆర్​డీఏఐ. భాగస్వాముల నుంచి దీనిపై ఏప్రిల్​ 17లోపు తమ అభిప్రాయాలను తెలపాలని కోరింది.

కొత్త ముసాయిదా ఏం చెబుతోంది...

  • బీమా లబ్ధిదారు క్లెయిమ్​ను ఏక మొత్తంలో గానీ వాయిదా పద్దతిలో గానీ పొందవచ్చు. ఇది మాత్రమే కాకుండా క్లెయిమ్​లో సగం ఏకమొత్తంలో మిగతా సగం వాయిదా పద్ధతిలో తీసుకునే వీలు కలగనుంది.
  • ఈ తరహా బీమా క్లెయిమ్​ను చెల్లించేందుకు గరిష్ఠంగా ఐదేళ్ల పరిమితి విధించింది.
  • ఈ రెండు రకాల బీమాలకు ఒకే విధమైన ప్రీమియం ధరలు ఉండనున్నాయి.
  • ఏక మొత్తంలో పొందే క్లెయిమ్​తో పోలిస్తే... వాయిదా పద్ధతిలో పొందే మొత్తాలు ఎక్కువగా ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details