తెలంగాణ

telangana

ETV Bharat / business

జెట్​ ఎయిర్​వేస్​కు ఐఓసీ ఝులక్​

జెట్ ఎయిర్​వేస్​కు ఏవియేషన్​ టర్బైన్ ఫ్యూయల్​ (ఏటీఎఫ్​) సరఫరాను పునరుద్ధరించింది ఐఓసీ. బకాయిలు చెల్లిస్తామన్న జెట్ హామీతో ఐఓసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే శుక్రవారం మధ్యాహ్నమే బకాయిలు చెల్లించని కారణంగా జెట్​కు ఏటీఎఫ్​ సరఫరాను  కాసేపు  నిలిపివేసింది ఐఓసీ.

జెట్​ ఏయిర్​వేస్

By

Published : Apr 5, 2019, 11:35 PM IST

బకాయిలు సకాలంలో చెల్లిస్తామని జెట్​ ఎయిర్​వేస్​ ఇచ్చిన హామీతో ఏవియేషన్​ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) సరఫరాను పునరుద్ధరించింది ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్​(ఐఓసీ). బకాయిలు పెరిగిపోయిన కారణంగా జెట్​కు ఏటీఎఫ్ సరఫరా నిలివేస్తున్నట్లు శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించింది ఐఓసీ. కాసేపు సరఫరాను నిలిపివేసింది.

ఇప్పటికే రుణ సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఏయిర్​వేస్​కు ఈ నిర్ణయంతో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. దీంతో దేశ వ్యాప్తంగా చాలా విమానాశ్రయాల్లో జెట్​ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది.

తీవ్ర రుణభారంతో ఉన్న జెట్​ యాజమాన్య బాధ్యతలను ఇటీవలే రుణదాతల కన్సార్షియాలనికి నేతృత్వం వహిస్తున్న ఎస్​బీఐ చేజిక్కించుకుంది. తక్షణ అవసరాలకు రూ.1,500 కోట్ల నిధులు సమకూర్చింది నూతన యాజమాన్యం. అయితే సంస్థ కష్టాల నుంచి గట్టెక్కేందుకు కావాల్సిన నిధులు మాత్రం ఇంకా సమకూరడం లేదు.

ABOUT THE AUTHOR

...view details