సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమికి సానుకూలంగా వస్తున్నట్లు లెక్కింపు సరళి స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఒక్కరోజులో రూ.2.87 లక్షల కోట్ల సంపద వృద్ధి - బీఎస్ఈ
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. భారీ లాభాలతో ఏకంగా సెన్సెక్స్ 40వేల మార్క్ దాటింది. బీఎస్ఈ మదుపరుల సంపద గురువారం ఒక్కరోజులోనే రూ.2.87 లక్షల కోట్లు పెరిగింది.
సంపద వృద్ధి
ఓ దశలో సెన్సెక్స్ తొలిసారి 40 వేల మార్కును దాటగా.. రికార్డు స్థాయిలో నిఫ్టీ 12 వేలకు పైగా ట్రేడయింది.
భారీ లాభాల కారణంగా బీఎస్ఈలో మదుపరుల సంపద సెషన్ ప్రారంభమైన కొద్ది సేపటికే... రూ. 2,87,028.8 కోట్లు పెరిగింది. ఫలితంగా మొత్తం సంపద రూ.1,53,56,153.14 కోట్లకు చేరింది.