ఒకప్పుడు వినోదం అంటే సినిమా థియేటర్లు మాత్రమే. ఆ తర్వాత కేబుల్ టీవీ. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ ఇలా ఎన్నో. ఇప్పుడున్న వినియోగదారులు కేబుల్ టీవీ కన్నా హాట్స్టార్ లాంటి వీడియో-ఆన్-డిమాండ్ సేవలు అందించే యాప్లవైపే అధికంగా ఆసక్తి చూపుతున్నట్లు జర్మన్ రీసెర్చ్ సంస్థ 'స్టాటిస్టా' ఇటీవలి నివేదికలో తెలిపింది.
ఈ నివేదిక ప్రకారం ఆన్లైన్ కంటెంట్కోసం అధికంగా వెచ్చిస్తున్న దేశాల్లో 52 శాతం వాటాతో భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఈ వరుసలో చైనా, బ్రెజిల్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మ్యూజిక్ సేవల విభాగంలో అమెజాన్ తొలి స్థానంలో ఉన్నట్లు స్టాటిస్టా పేర్కొంది.
జియో రాకతోనే...
భారత్లో వీడియో స్ట్రీమింగ్ ఇంతలా పెరిగేందుకు రిలయన్స్ జియో ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది. జియో ఉచిత డాటాతో సృష్టించిన ప్రభంజనంతో గ్రామాల్లోనూ వీడియోలు చూసే అలవాటు గణణీయంగా పెరిగిందని వివరించింది స్టాటిస్టా.
దేశంలోని 40శాతం గ్రామాలకే అంతర్జాల సదుపాయం ఉంది. అయితే వీడియో స్ట్రీమింగ్లో 65 శాతం వినియోగం గ్రామాల్లోనే జరుగుతుండటం విశేషం.
కేబుల్ టీవీలకు ప్రమాదంగా...