తెలంగాణ

telangana

ETV Bharat / business

"భారత్​ మిగులు విద్యుత్ దేశం కాదు"

2018-19 సంవత్సరానికి భారత్​లో గరిష్ఠ డిమాండ్​ ఉన్న సమయంలో 0.8 శాతం విద్యుత్​ లోటు నమోదైంది. మొత్తం మీద ఈ లోటు 0.6 శాతంగా  ఉంది. దీనితో మిగులు విద్యుత్​ హోదాను పొందలేకపోయింది మన దేశం.

"భారత్​ మిగులు విద్యుత్ దేశం కాదు"

By

Published : Apr 19, 2019, 11:40 PM IST

మిగులు విద్యుత్​ హోదా ఈ సారి కూడా భారత్​కు దక్కలేదు. 2018-19 సంవత్సరానికి గరిష్ఠ డిమాండ్​ ఉన్న సమయంలో 0.8 శాతం విద్యుత్​ లోటు ఉంది. మొత్తం మీద ఈ లోటు 0.6 శాతంగా ఉంది.

కేంద్ర విద్యుచ్ఛక్తి ప్రాధికార సంస్థ(సీఈఏ) 2018-19కి తయారుచేసిన లోడ్​జనరేషన్​ బ్యాలెన్సింగ్​ నివేదిక ప్రకారం మొత్తం మీద మిగులు విద్యుత్​ 4.6 శాతం ఉండగా... గరిష్ఠ డిమాండ్​ సమయంలో ఇది 2.5 శాతంగా ఉంది. దీని ప్రకారం భారత్​ మిగులు విద్యుత్​ దేశంగా మారుతుందని తెలిపింది.
కానీ తాజా గణాంకాలు మాత్రం మరోలా ఉన్నాయి. గరిష్ఠంగా 177.02 గిగావాట్లు డిమాండ్​ ఉన్న సమయంలో 175.52 గిగావాట్ల విద్యుత్​ సరఫరా అయింది. దీని ప్రకారం లోటు 1.49 గిగావాట్లు. ఇది 0.8 శాతంతో సమానం.

మొత్తం మీద 1,267.29 బీయూ(బిలియన్​ యూనిట్లు) విద్యుచ్ఛక్తి సరఫరా చేశారు. కానీ డిమాండ్​ 1,274.56 బీయూల డిమాండ్​ ఉంది. అనగా లోటు 0.6 శాతం(7.35బియూలు)

2017-18లోనే భారత్​ మిగులు విద్యుత్​ దేశంగా మారుతుందని సీఈఏ మొదట అంచనా వేసింది. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం విద్యుత్​ లోటు 0.7 శాతం, గరిష్ఠ డిమాండ్​ సమయంలో లోటు 2.1 శాతంగా నమోదైంది.

"కరెంటు సరఫరా చేసే డిస్కంలు విద్యుత్​ను కొనలేకపోవటం వల్లే ఈ లోటు నమోదైంది. ఈ జనవరి వరకు వాటి అప్పులు రూ. 40వేల కోట్లున్నాయి. భారత్​లో స్థాపిత విద్యుత్​ ఉత్పత్తి సామర్థ్యం 356 గిగావాట్లుగా ఉంది. అదే సమయంలో గరిష్ఠ డిమాండ్​ మాత్రం 177 గిగావాట్లు మాత్రమే. బాకీలు చెల్లించినట్లయితే విద్యుత్​ ఉత్పత్తిని రెట్టింపు చేయవచ్చు" - విద్యుత్​ రంగ నిపుణులు.

ABOUT THE AUTHOR

...view details