తెలంగాణ

telangana

ETV Bharat / business

'2020లో భారత వృద్ధి రేటు అంచనా 7.1 శాతం'

భారత వృద్ధి రేటు 2019-20 ఆర్థిక సంవత్సరానికి 7.1 శాతంగా నమోదవుతుందని ఐరాస అంచనా వేసింది. జనవరిలో విడుదల చేసిన అంచనాలతో పోలిస్తే తాజా నివేదికలో వృద్ధి రేటు తగ్గింది.

వృద్ధి రేటు

By

Published : May 22, 2019, 1:51 PM IST

బలమైన పెట్టుబడులు, దేశీయ వినియోగం కారణంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి 7.1 శాతంగా నమోదవుతుందని ఐరాస అంచనా వేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిపై జనవరిలో విడుదల చేసిన నివేదికను తాజాగా సవరించింది ఐరాస.

జనవరిలో విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, అంచనాలు (డబ్లూఈఎస్​పీ)- 2019 నివేదికలో భారత వృద్ధి 2018-19లో 7.6 శాతంగా, 2019-20లో 7.4 శాతంగా ఉంటుందని అంచనా వేసింది ఐరాస. తాజా సవరణ నివేదికలో ఈ అంచనాలు వరుసగా 7.0 శాతం, 7.1 శాతంగా ఉంటాయని పేర్కొంది.

భారత వృద్ధి అంచనాలు తగ్గించినప్పటికీ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్​.. చైనా కన్నా ముందున్నట్లు పేర్కొంది.

3.0 శాతానికి మించని ప్రపంచ వృద్ధి

డబ్ల్యూఈఎస్​పీ-2019 ప్రకారం 2018లో 3.0 శాతంగా ఉన్న ప్రపంచ వృద్ధి రేటు... 2018-19లో 2.7 శాతంగా, 2019-20లో 2.9 శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది ఐరాస.

డబ్ల్యూఈఎస్​పీ-2019 అర్ధ సంవత్సర నివేదికలో అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థల అంచనాలను తగ్గించింది ఐరాస.

పరిశ్రమల ఉత్పత్తిలో తగ్గుదల, అంతర్జాతీయంగా వాణిజ్య బలహీనతలు సహా, అమెరికా-చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధ పరిణామాలు ప్రపంచ వృద్ధి అంచనాల తగ్గుదలకు కారణమని పేర్కొంది.

చైనాకు గడ్డుకాలమే

అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తార స్థాయికి చేరింది. ఈ కారణంగా 2017-18లో 6.6 శాతంగా ఉన్న చైనా ఆర్థిక వృద్ధి రేటు 2018-19లో 6.3 శాతానికి తగ్గే అవకాశం ఉంది. 2019-20లో మరింత క్షీణించి 6.2 శాతానికి తగ్గవచ్చని ఐరాస అంచనా వేసింది.

ABOUT THE AUTHOR

...view details