తెలంగాణ

telangana

ETV Bharat / business

పురుషులకు పోటీగా.. మహిళా యూట్యూబర్​ల జోరు..

దేశంలో పురుషులకు పోటీగా మహిళా యూట్యూబర్​లు దూసుకుపోతున్నారు. 2015లో 10 లక్షల మంది సబ్​స్క్రైబర్​ల జాబితాలో కనీసం ఒక్క మహిళా యూట్యూబర్ లేకున్నా.. 2019 నాటికి 120 మంది ఆ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం.

యూట్యూబ్

By

Published : Sep 29, 2019, 5:31 AM IST

Updated : Oct 2, 2019, 10:09 AM IST

భారత్​లో మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. యూట్యూబర్​లుగా ఆన్​లైన్​లోనూ పురుషులు గట్టిపోటీ ఇస్తున్నారు. యూట్యూబ్ మాతృ సంస్థ గూగుల్ వెల్లడించిన తాజా గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.

10 లక్షల మంది సబ్​స్క్రైబర్​లకు పైగా చందాదారులున్న మహిళా యూట్యూబర్​ల సంఖ్య గత మూడేళ్లలో 120కి పెరిగినట్లు గూగుల్ తెలిపింది. భారత్​లో మొత్తం 1,200 యూట్యూబ్​ ఛానెళ్లకు 10 లక్షలకు పైగా సబ్​స్క్రైబర్లు ఉన్నట్లు పేర్కొంది.

"10 లక్షల మంది సబ్​స్క్రైబర్ల జాబితాలో 2015లో కనీసం ఒక్కరు కూడా మహిళా యూట్యూబర్​ లేరు. 2016లో తొలి సారి ఒక మహిళా యూట్యూబర్ 10 లక్షల సబ్​స్క్రైబర్లను దక్కించుకున్నారు. ఆ తర్వాత వారి సంఖ్య 2017 లో ముగ్గురు.. 2019 నాటికి ఏకంగా 120కి చేరింది." - సత్య రాఘవన్​, యూట్యూబ్​ కంటెంట్ భాగస్వామ్య డైరెక్టర్​, యూట్యూబ్​ ఇండియా

10 లక్షల మంది సబ్​స్క్రైబర్​ మార్క్​ను అందుకున్న యూట్యూబర్లంతా.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కంటెంట్​ అందిస్తున్నట్లు రాఘవన్​ పేర్కొన్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ భాషల్లో ఉంటున్నట్లు తెలిపారు.

నెలవారీ ప్రాతిపాదికన దేశవ్యాప్తంగా 265 మిలియన్ల మంది యూట్యూబ్​ను క్రియాశీలంగా వినియోగిస్తున్నట్లు రాఘవన్ తెలిపారు.

ఇదీ చూడండి: పండుగ సీజన్​లో సరికొత్త మొబైల్​ ఫోన్లు

Last Updated : Oct 2, 2019, 10:09 AM IST

ABOUT THE AUTHOR

...view details