ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ ఆర్ నారాయణమూర్తి ఇటీవల అమెజాన్ నిర్వహించిన కార్యక్రమంలో కాస్త అసంతృప్తికి లోనయ్యారు. అమెజాన్ బుధవారం 'సంభవ్' పేరుతో దిల్లీలోని జవహార్‌లాల్‌నెహ్రూ స్టేడియంలో కార్యక్రమం నిర్వహించింది.
ఈ కార్యక్రమం ప్రారంభించడానికి సంస్థ దాదాపు గంటన్నర సమయం ఆలస్యం అయింది. దీంతో నారాయణమూర్తి ప్రసంగించే సమయంలో ఆలస్యం విషయంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘మనం దాదాపు గంటన్నర సమయం ఆలస్యం చేశాం. నిజానికి నేను ఇక్కడ 20నిమిషాలు మాట్లాడాలి. కానీ ఇప్పుడు ఐదు నిమిషాల్లో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే ఆలస్యం చేయడం నాకు అలవాటు లేదు’ అంటూ ఆయన ప్రసంగం పూర్తి చేసి వేదిక దిగారు.