దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ భారత మార్కెట్లోకి సరికొత్త ఎలెంట్రాను విడుదల చేసింది. దిల్లీ ఎక్స్‌షోరూమ్‌లో దీని ప్రారంభ ధర రూ.15.89 లక్షల నుంచి రూ.20.39 లక్షలుగా నిర్ణయించారు.
ఈ కారులో బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీని వినియోగించారు. భారత్‌లో సెడాన్ విభాగంలో ఈ సాంకేతికతను వినియోగించిన మొదటి మోడల్ ఇదే. బీఎస్-VI పెట్రోల్ ఇంజిన్ను ఈ మోడల్లో పొందుపరిచింది హ్యుందాయ్. ఈ కారు విభిన్న వేరియంట్లతో రానుంది.
ఫీచర్లు ఇవే...
ఎలెంట్రా కొత్త వెర్షన్‌లో.. 34 ప్రత్యేక ఫీచర్లు ఆకర్షిస్తున్నాయి. హెడ్‌ల్యాంప్స్, బంపరు, ఫాగ్ ల్యాంప్స్‌లో మార్పులు చేశారు. ఈ కారు మొత్తం ఐదు రంగుల్లో లభిస్తుంది. వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్‌సీట్స్, ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్, డోర్ స్పీకర్స్, సెంటర్ స్పీకర్స్, రియర్ ఏసీ, అల్యూమినియం పెడల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఏబీఎస్, ఈబీడీ , ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, రియర్‌పార్కింగ్ సెన్సర్, హిల్ అసిస్టెంట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ వంటి సేఫ్టీ ఫీచర్లూ ఉన్నాయి.
ఇదీ చూడండి: టెలికాం ఆపరేటర్ల 'ట్రింగ్ ట్రింగ్ యుద్ధం' వెనుక కథ ఇది!