తెలంగాణ

telangana

ETV Bharat / business

'త్వరలోనే మారటోరియం ఎత్తివేస్తాం.. సేవలందిస్తాం'

ఖాతాదారులకు ఆటంకం లేని సేవలందించటమే తమ ప్రథమ లక్ష్యమని ఎస్​ బ్యాంకు పాలనాధికారి ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు. త్వరలోనే మారటోరియాన్ని ఎత్తివేసి సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు.

yes bank
ప్రశాంత్

By

Published : Mar 9, 2020, 8:34 PM IST

ఎస్‌ బ్యాంకు సేవలను వేగంగా పునరుద్ధరించేందుకు కృషిచేస్తున్నామని పాలనాధికారి ప్రశాంత్‌కుమార్‌ అన్నారు. ఎస్‌ బ్యాంకు గత 5 రోజులుగా ఎదుర్కొంటున్న ఒడిదొడుకుల నేపథ్యంలో ఆ బ్యాంకు పాలనాధికారిగా ప్రశాంత్‌కుమార్‌ను ఆర్బీఐ నియమించిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ప్రశాంత్ కుమార్​ మాట్లాడుతూ.. ఖాతాదారులకు ఆటంకం లేని సేవలు అందించడమే తమ ప్రథమ లక్ష్యమన్నారు. శనివారం సాయంత్రానికే పెద్దసంఖ్యలో ఏటీఎమ్‌లను పునరుద్ధరించామని ఆయన పేర్కొన్నారు. సంస్థ వివిధ శాఖల్లోని ఉద్యోగులు ఖాతాదారుల సమస్యలను నివృత్తి చేస్తున్నారని తెలిపారు.

సమస్యల్లో చిక్కుకున్నప్పటికీ..

బ్యాంకు సమస్యల్లో చిక్కుకున్నప్పటికీ ఖాతాదారులు సహనం కోల్పోకుండా తమతో సహకరించారన్నారు ప్రశాంత్​. వారిలో సంస్థ పట్ల ఉన్న విశ్వాసం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. త్వరలోనే మారటోరియాన్ని ఎత్తివేసి మిగిలిన అన్ని సేవలు కూడా త్వరితగతిన అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

సంక్షోభంలో చిక్కుకున్న ఎస్​ బ్యాంకుపై ఆర్బీఐ మారటోరియం విధించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 3 వరకు ఎస్‌ బ్యాంకు ఖాతాదారులు వారి ఖాతా నుంచి కేవలం రూ.50 వేల నగదును మాత్రమే ఉపసంహరించుకునే వీలుంది.

ఇదీ చూడండి:ఎస్​ బ్యాంకు కుంభకోణంలో ఏడుగురికి లుక్​ అవుట్​

ABOUT THE AUTHOR

...view details