Home Loan EMI: గృహరుణం తీసుకోవాలని అనుకున్నప్పుడు ఒకసారి పూర్తిస్థాయి ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. సంపాదనలో దాదాపు 40 శాతం వరకూ రుణ ఈఎంఐకి కేటాయించాల్సి వచ్చినప్పుడు.. మిగతా మొత్తంతో ఎలా సర్దుకోవాలి అనేది చూసుకోవాలి. తొందరగా ఈఎంఐ భారం నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. అందుకోసం..
ఒక వాయిదా అదనంగా..
సాధారణంగా ఏడాదికి 12 వాయిదాలు చెల్లిస్తుంటాం. కానీ, మన అప్పు తొందరగా తీరాలంటే.. ఏడాదికి 13 వాయిదాలు చెల్లించాలి. అనుకోకుండా మనకు వచ్చిన అదనపు డబ్బు లేదా ఖర్చులను తగ్గించుకోవడం వల్ల మిగిలిన మొత్తంలాంటివి ఈ అదనపు ఈఎంఐ కోసం కేటాయించాలి. దీనివల్ల మీ రుణ మొత్తంలో అసలు తగ్గిపోతుంది. అనుకున్న వ్యవధికన్నా ముందే అప్పు తీర్చేందుకు వీలవుతుంది. వడ్డీ భారమూ తగ్గుతుంది. బ్యాంకులు, గృహరుణ సంస్థలు ఫ్లోటింగ్ రేటుకు అందించిన గృహరుణాలపై ఎలాంటి ముందస్తు చెల్లింపు రుసుమునూ వసూలు చేయవు. ఈఎంఐలను ముందుగానే చెల్లిస్తూ ఉండటం వల్ల మీ క్రెడిట్ స్కోరూ మెరుగవుతుంది.
ఖర్చులకు సరిపోవడం లేదా..
ఇంటిరుణం ఈఎంఐ చెల్లించిన తర్వాత మిగిలిన మొత్తం ఇంటి ఖర్చులకు సరిపోవడం లేదా.. దీని గురించి ఆందోళన చెందకండి. ఇటీవల కాలంలో వడ్డీ రేట్లు తగ్గడంతో మీ రుణ వ్యవధిలోనూ తేడా వచ్చింది. మీ బ్యాంకు/గృహరుణ సంస్థను సంప్రదించి ఈ వివరాలు ఒకసారి చూసుకోండి. వ్యవధిని పెంచి, ఈఎంఐని తగ్గించే అవకాశాలుంటాయి. దీన్ని వినియోగించుకునే అవకాశం ఎంతమేరకు ఉందో చూసుకోండి. దీనివల్ల మీ ఖర్చులకు ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. ఆదాయం పెరిగినప్పుడు వీలును బట్టి, ఈఎంఐని అధికంగా చెల్లించడం మర్చిపోవద్దు.
అప్పుడప్పుడూ..