తెలంగాణ

telangana

ETV Bharat / business

విద్యుత్​ వాహనాలపై జీఎస్​టీ 5 శాతానికి తగ్గింపు - జీఎస్టీ కౌన్సిల్

విద్యుత్ వాహన రంగానికి భారీ ఊరటనిచ్చింది జీఎస్​టీ మండలి. నేడు జరిగిన 36వ సమావేశంలో ఎలక్ట్రిక్​ వాహనాలపై జీఎస్​టీని 12 నుంచి 5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తగ్గిన పన్ను రేట్లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

జీఎస్టీ

By

Published : Jul 27, 2019, 1:36 PM IST

Updated : Jul 27, 2019, 1:42 PM IST

విద్యుత్ వాహనాలపై ఉన్న 12 శాతం జీఎస్​టీని 5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది జీఎస్టీ మండలి 36వ సమావేశం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మండలి సమావేశమైంది. రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

విద్యుత్ వాహనాలపై జీఎస్​టీ తగ్గింపు ఆగస్టు 1నుంచి అమల్లోకి రానుంది. ఎలక్ట్రిక్​ వాహన రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది మండలి.

స్థానిక సంస్థల నుంచి అద్దెకు తీసుకునే విద్యుత్ బస్సులపై జీఎస్​టీ మినహాయింపునకు మండలి ఆమోదం తెలిపింది. విద్యుత్ వాహనాల ఛార్జర్లపైనా జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది.

ఇదీ చూడండి: త్వరలో మరో 20-25 విమానాశ్రయాల ప్రైవేటీకరణ

Last Updated : Jul 27, 2019, 1:42 PM IST

ABOUT THE AUTHOR

...view details