విద్యుత్ వాహనాలకు జీఎస్టీ తగ్గింపుపై ఈ నెల 25న జరిగే మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జీఎస్టీ 36వ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఇందులో సౌర విద్యుత్, టర్బైన్ విద్యుత్తు ప్రాజెక్టులకు జీఎస్టీ విధింపును మరోసారి సమీక్షించనుంది కౌన్సిల్.
రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమక్షంలో గత నెల జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. ఇందులో విద్యుత్ వాహనాలు, ఛార్జర్లు సహా పలు ముఖ్య అంశాలపై కౌన్సిల్‌కు సూచనలు చేశారు మంత్రులు. వీటిపై అధ్యయనం చేసేందుకు నియమించిన కమిటీ 25న జరిగే మండలి సమావేశానికి ముందే తమ సిఫార్సులు పంపనుంది.
కీలక అంశాలు ఇవే..
దేశీయంగా విద్యుత్ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు.. జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించాలనేది ప్రధానాంశంగా ఉండనుంది.