ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు కేంద్రం కసరత్తు ముమ్మరం చేసింది. బిడ్డర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)ను ఆహ్వానించడానికి, వాటాల కొనుగోలు ఒప్పందం(ఎస్‌పీఏ)కి సంబంధించి మరో 4 రోజుల్లో ప్రకటన వెలువడనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఇటీవలే ఈఓఐకి ఆమోదం..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో సమావేశమైన మంత్రుల బృందం ఈఓఐ, ఎస్‌పీఏకి ఈ నెల 7న ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు త్వరలోనే ప్రకటన వెలువడనున్నట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.
2018-19 ఆర్థిక సంవత్సరానికి ఎయిర్ ఇండియా రూ.8,556 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. మొత్తం రూ.80వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన కంపెనీని ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం చాలా రోజులుగా సన్నాహాలు చేస్తోంది.