వృద్ధికి ఊతమందించే దిశగా ప్రభుత్వం మరిన్ని దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రభుత్వాధీనంలోని సంస్థలు.. వ్యాపారులకు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన దీర్ఘకాలిక బకాయిలను పూర్తి చేసేందుకు సిద్ధమైంది. ఇందుకు అక్టోబర్ 15ను తుది గడువుగా నిర్దేశించింది కేంద్రం.
ప్రభుత్వ సంస్థల ఉన్నతాధికారులతో.. మూలధన వ్యయాలపై నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సర్వీస్ ప్రొవైడర్లు, వ్యాపారులు, కాంట్రాక్టర్లకు బిల్లులకు సంబంధించి ఒక పోర్టల్‌ను ఏర్పాటుచేయాలని ఆయా సంస్థలకు సూచించినట్లు మంత్రి తెలిపారు.