ఐసీసీ ప్రపంచ కప్ 2019 ఫైనల్ మ్యాచ్లో తలపడేది భారత్, ఇంగ్లాండ్ జట్లేనని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అంచనావేశారు. ఆ మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తుందని అన్నారాయన. తాను కూడా క్రికెట్కు అభిమానినే అని భారత్-అమెరికా వాణిజ్య మండలి సదస్సులో పిచాయ్ పేర్కొన్నారు.
అమెరికాకు వచ్చిన తొలినాళ్లలో బేస్ బాల్ ఆడటం సవాలుగా అనిపించిందని తెలిపారు.