తెలంగాణ

telangana

ETV Bharat / business

'వార్తలు వారివి... కోట్ల డాలర్లు గూగుల్​వి' - వార్తలు

గూగుల్​ న్యూస్​ తెలుసుగా...! వేర్వేరు మీడియా వెబ్​సైట్ల వార్తలన్నీ ఒకే చోట కనిపిస్తాయి. గూగుల్​ సిబ్బంది రాసే వార్త ఒక్కటీ ఉండదు. కానీ... సంపాదనలో మీడియా సంస్థలనే మించిపోయింది గూగుల్​. ఆ సంస్థలన్నీ కలిపితే ఒకవైపు, గూగుల్​ ఓవైపు అన్నట్లు తయారైంది పరిస్థితి.

'వార్తలు వారివి... కోట్ల డాలర్ల గూగుల్​వి'

By

Published : Jun 10, 2019, 7:19 PM IST

Updated : Jun 10, 2019, 7:41 PM IST

గూగుల్​....టెక్​ దిగ్గజం. సెర్చ్​, మ్యాప్స్​, యాప్స్​... ఇలా ఎన్నో సేవలు అందిస్తుంది. దాదాపు అన్నీ సాంకేతికతకు సంబంధించినవే. పాత్రికేయంతో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదు గూగుల్​కు. అయినా ఆ సంస్థ వార్తల ద్వారా 2018లో ఎంత సంపాదించిందో తెలుసా? ఏకంగా 470 కోట్ల డాలర్లు. ఇతర మీడియా సంస్థల వార్తలను సెర్చ్​, గూగుల్​ న్యూస్​ ద్వారా అందించడం ద్వారా గూగుల్​ ఇంత భారీ మొత్తంలో ఆర్జించిందని న్యూస్​ మీడియా అలయన్స్​-ఎన్​ఎమ్​ఏ ఓ నివేదిక ద్వారా వెల్లడించింది.

అమెరికాలోని 2 వేలకుపైగా పత్రికలు... ఎన్​ఎమ్​ఏలో భాగస్వాములు.

అసలు సంస్థలకు ఎసరు....

అమెరికాలోని మీడియా సంస్థలు 2018లో డిజిటల్​ అడ్వర్​టైజింగ్​ ద్వారా ఆర్జించిన మొత్తం 510 కోట్ల డాలర్లు. ఆ మొత్తానికి దాదాపు సమానంగా సంపాదించింది గూగుల్​. ఇతర మీడియా సంస్థల వార్తలను సొమ్ము చేసుకోవడంలో గూగుల్​ ఎంత మేర ముందుందో ఈ గణాంకాలే స్పష్టంచేస్తున్నాయని నివేదికలో పేర్కొంది ఎన్​ఎమ్​ఏ. గూగుల్​ ప్రభావంతో గత 2 దశాబ్దాల్లో కొన్ని మీడియా సంస్థలు మూతపడ్డాయని, మరికొన్ని గణనీయంగా ఆదాయం కోల్పోయాయని ఆవేదన వ్యక్తంచేసింది న్యూస్​ మీడియా అలయన్స్​.

గూగుల్​కు ఆదాయం ఇలా....

"గూగుల్​కు వచ్చే సెర్చ్​ రిక్వెస్ట్​లలో దాదాపు 40 శాతం వార్తల కోసమే. నెటిజన్లను గూగుల్​ ఇతర మీడియా సంస్థల వెబ్​సైట్లకు మళ్లిస్తుంది. ఆ పని ఉచితంగా ఏమీ చేయదు. ఆన్​లైన్​ యాడ్​ రెవెన్యూలో వాటా తీసుకుంటుంది. వినియోగదారుడు వార్త లింక్​పై క్లిక్​ చేసినప్పుడు అతడి వ్యక్తిగత సమాచారం సేకరించడం ద్వారా గూగుల్​ సంపాదించే మొత్తాన్ని మేము లెక్కించలేదు."

- ఎన్​ఎమ్​ఏ నివేదిక

ఆ రెండు సంస్థలే...

న్యూస్​ పబ్లిషర్లకు ప్రస్తుతం గూగుల్​, ఫేస్​బుక్​ ప్రధాన డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నాయి. వేర్వేరు వెబ్​సైట్లకు వచ్చే ఎక్స్​టర్నల్​ ట్రాఫిక్​లో 80శాతం ఈ రెండు సంస్థల నుంచి వస్తున్నదే.

Last Updated : Jun 10, 2019, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details