సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనో ప్రపంచవ్యాప్తంగా 15,000 ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. రానున్న మూడేళ్లలో 2 బిలియన్ యూరోల మేర ఖర్చులు తగ్గించుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది ఫ్రాన్స్‌కు చెందిన ఈ సంస్థ. ఈ మేరకు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.
తాజా నిర్ణయంతో ఫ్రాన్స్‌లో అత్యధికంగా 4,600 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారని రెనో ప్రకటించింది. ఫ్రాన్స్ మినహా ఇతర దేశాల్లో 10 వేలకు పైగా మందికిపైగా ఉద్యోగులను తగ్గించుకోనున్నట్లు వెల్లడించింది.