నకిలీ రాజకీయ వార్తలపై సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్బుక్ ఉక్కుపాదం మోపింది. అమెరికాలో వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నందువల్ల ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఆన్లైన్ నెట్వర్క్ కార్యకర్త అవాజ్ బుధవారం నివేదిక విడుదల చేశారు.
ఓ స్వచ్ఛంద సంస్థ అందించిన విశ్లేషణ ప్రకారం అక్టోబరు 31తో ముగిసిన 10 నెలల్లో అమెరికా రాజకీయాల గురించి ఫేస్బుక్లో 100 కథనాలు వైరల్ అయ్యాయి. ఈ అవాస్తవ వార్తలకు ఏకంగా 158 మిలియన్లకు పైగా వీక్షణలు పెరిగాయి. ఈ వ్యూస్‌ను బట్టి ప్రతి ఓటరుకు ఈ సమాచారం అందినట్లు స్పష్టం అవుతోందని అవాజ్ వెల్లడించారు.
ఇతర మాధ్యమాల్లోనూ కట్టుదిట్టం
ఈ ఫలితాలను గమనిస్తే అమెరికాలో 2020 ఎన్నికలకు ముందే ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని అవాజ్ నివేదికలో పేర్కొన్నారు. అంతేకాక ఇతర మాధ్యమాలైన యూట్యూబ్, ట్విట్టర్, ఇస్టాగ్రామ్, వాట్సాప్ వంటి వాటిల్లోనూ రాజకీయంగా విస్తరిస్తున్న అసత్య ప్రచారం గురించి విశ్లేషించాలంటూ సామాజిక సంస్థ తెలిపింది.